Home » May 22st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 22st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఢిల్లీలో సీనియ‌ర్ జర్నలిస్ట్‌, ఆర్థికవేత్త, రచయిత ప్రణయ్‌ రాయ్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలపై చర్చించారు.

Advertisement

Ap cm jagan

Ap cm jagan

ఏపీ సీఎం జ‌గ‌న్ దావోస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కాగా ఆయ‌న వ‌ర‌ల్డ్ఎక‌నామినిక్ ఫోర‌మ్ లో పాల్గొన‌నున్నారు.

ముంబై చేతిలో ఢిల్లీ ఓట‌మిపాలైంది. ఈ ఓట‌మితో రిష‌బ్ సేన టోర్నీ నుండి నిశ్క్ర‌మించింది. ఢిల్లీ ఓటమితో ఆర్సీబీ లో సంబురాలు షురూ అయ్యాయి. ముంబై ఓట‌మితో ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు చేరుకుంది.

ఈ నెల 24న క్వాడ్ శిఖ‌రాగ్ర స‌ద‌స్సులో పాల్గొనేందుకు ప్ర‌ధాని మోడీ జ‌పాన్ వెళుతున్నారు. ఈ సంధ‌ర్బంగా అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ తో పాటు ప‌లువురు దేశాధినేత‌ల‌తో భేటీ కానున్నారు.

మే 25 వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త‌వాతావ‌ర‌ణ‌శాఖ ఐఎమ్డీ ప్ర‌క‌టించింది. ఏపీ, తెలంగాణ స‌హా పంజాబ్, ఉత్త‌రాఖండ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, రాజస్థాన్ , యూపీలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వెల్ల‌డించింది.

Advertisement

దేశ‌వ్యాప్తంగా టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ ఫీజులు డ‌బుల్ కానున్నాయి. 2015లో శ్రీకృష్ణ క‌మిటీ ఇచ్చిన నివేధిక‌ను అమ‌లు చేయాల‌ని ఏఐసీటీఈ అన్ని రాష్ట్రాల ఫీజు నియంత్ర‌ణ క‌మిటీల‌ను ఆదేశించింది. దాంతో తెలంగాణ‌లో క‌నిష్ట ఇంజ‌నీరింగ్ కోర్సు ఫీజు రూ.35 వేలు ఉండ‌గా ఇప్పుడు రూ.67 వేల‌కు పెర‌గ‌నుంది.

ఏ విమానంలో అయినా ఎయిర్ హోస్టెస్ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారు. కానీ మొద‌టిసారి బ్రిటిష్ ఎయిర్వేస్ లో ఎయిర్ హోస్టెస్ తెలుగులో స్వాగతం ప‌లికేలా సేవ‌లు అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.

ఆస్ట్రేలియా కొత్తం ప్ర‌ధానిగా లేబ‌ర్ పార్టీ నాయకుడు ఆంటోని ఆల్బ‌నీస్ బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో లిబ‌రర్ పార్టీకి చెందిన స్కాట్ మోరిస‌న్ ను ఆంటోని ఓడించారు.

ఆదాయానికి మించి ఆస్తులున్నాయ‌ని హ‌ర్యాణా మాజీ సీఎం చౌతాలా దోషిని సీబీఐ ప్ర‌త్యేక‌కోర్టు దోషిగా తేల్చింది.

కేంద్రం పెట్రోల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా కేర‌ళ ప్ర‌భుత్వం కూడా త‌మ రాష్ట్రంలో పెట్రోల్ పై రూ.2.41, డీజిల్ పై రూ.1.36 చొప్పున త‌గ్గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

Visitors Are Also Reading