ఆకాశంలో నెలవంక కనిపించలేదు. దాంతో దేశవ్యాప్తంగా రేపు రంజాన్ పండగ జరుపుకోవాలని రూయాత్ హిలాల్ కమిటీ ప్రకటించింది.
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దాంతో పంటలు తడిచిపోయి రైతులకు నష్టం జరిగింది. అంతే కాకుండా భారీగా వీచిన గాలులకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.
Ap cm jagan
ఏపీ సర్కార్ సచివాలయాల్లో పాస్ పోర్ట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా ప్రజల చెంతకు మరికొన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్నయం తీసుకుంది. 1600 సచివాలయాల్లో పలు సేవలు అందుబాటులోకి వచ్చాయి.
జూన్ నుంచి మరో 2500 సచివాలయాల్లో ఆధార్ సేవలు ప్రారంభించాని సర్కార్ నిర్నయం తీసుకుంది. సచివాలయ సిబ్బంది ద్వారా అన్ని పాఠశాలల్లో ఆధార్ క్యాంప్ లు సైతం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది.
అమెరికాలో షికాగోలో కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో 8మంది దుర్మరణం చెందారు. మరో16 మందికి గాయాలయ్యాయి. బ్రెటస్ పార్కు, సౌత్ ఇండియానా ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి.
Advertisement
రాజేంద్రనగర్ దుర్గా నగర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు పల్టీలు కొట్టింది. అంతే కాకుండా ఎదురుగా ఉన్న రోడ్డు పైకి దూసుకువచ్చింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. దాంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.
అమెరికా ఇంటిలిజెన్స్ సంస్థ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా భారత సంతతికి చెందిన నంద్ మూల్ చందాని నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఐఏ డైరెక్టర్ విలియమ్ జె బెర్న్ వెల్లడించారు.
విదేశీ పర్యటనకు ముందు ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. భారత్ శాంతి శ్రేయస్సుకు ఐరోపా భాగస్వాముల సహకారం కీలకమని కాబట్టి ఐరోపాతో బంధం పటిష్టం చేసుకుంటామని అన్నారు.
రంజాన్ పండగను పురస్కరించుకుని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ ఆనంద్ వెల్లడించారు.
ముంబై నుండి పశ్చిమ బెంగాల్ కు వెళుతున్న స్పైస్ జెట్ కు చెందిన ఓ విమానం గాలిలో భారీగా కుదుపులకు లోనైంది. దాంతో 12 మంది ప్రయాణీకులకు తీవ్రగాయలయ్యాయి.