వర్షం కారణంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ రద్దు అయింది. ముఖ్యంగా ఐదు టీ-20 సిరీస్ లలో 2-2 తేడాతో గెలిచి రెండు టీమ్‌లు సమానంగానే ఉన్నాయి. తొలుత వర్షం వచ్చి పోయిన తరువాత మ్యాచ్ జరుగుతుందని ఆలస్యంగా జరుగుతుందని ప్రకటించినప్పటికీ ఆ తరువాత వర్షం ఏకధాటిగ పడడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
Advertisement
దీంతో ఐదు టీ-20 సిరీస్ 2-2 సమంతో ఇరు జట్లు సిరీస్ కైవసం చేసుకోవాలనే కోరిక ఉంది. ముఖ్యంగా టాస్ వేయడానికి ముందేవాతావరణ పరిస్థితులు తేడా కొట్టాయి. కారు మబ్బులు కమ్ముకోవడంతో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్పటికీ వర్షం పడకపోవడం టాస్ వేశారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. టాస్ వేసిన కొద్ది సేపటికే వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ 50 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. 19 ఓవర్లకే మ్యాచ్ కుదించారు. వాతావరణ పరిస్థితి బాగుండడంతో భారత్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది.
Advertisement
ఇక క్రీజులోకి వచ్చిన భారత ఓపెనర్లు శుభారంభాన్నే ఇచ్చారు. ఇషాన్ కిషన్ కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదేశాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఎన్గిడి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక వెంటనే రుతురాజ్ గైక్వాడ్ కూడా వెనుదిరిగాడు. భారత జట్టు 3.3 ఓవర్లకు 28 పరుగులు చేసి 2 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో వరుణుడు ప్రత్యక్షం కావడంతో ఆట ఆపేశారు. ఇక వర్షం ఆగకపోవడంతో ఇక మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరువురికి సిరీస్ అందజేశారు.