Home » బావ కోసం మరదలు త్యాగం.. ఇలాంటి ప్రేమ ఇప్పుడు సాధ్యమేనా..?

బావ కోసం మరదలు త్యాగం.. ఇలాంటి ప్రేమ ఇప్పుడు సాధ్యమేనా..?

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువ.  కొందరూ ప్రేమ గురించి ప్రేయసి లేదా ప్రియుడు ప్రాణాలను కోల్పోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. నేటి కాలంలో అంతర సౌందర్యం కంటే కూడా బాహ్య సౌందర్యాన్ని చూసే ప్రేమలు పెరిగిపోయాయి. ఇలాంటి ప్రేమ కథలు తరచూ జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఇద్దరి మధ్య ప్రేమ ఉదయం మొదలై.. సాయంత్రంతో ఎండ్ అవుతోంది. డబ్బు, అవసరాల కోసమే ప్రేమ అన్నట్టుగా తయారయింది. ఖాళీ సినిమా థియేటర్లలో కార్నర్ సీట్లలో కూర్చోవడం, కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసుకొని తాగడంగా మారిపోయింది. కానీ తమది అలాంటి ప్రేమ కాదు అని నిరూపించింది ఈ జంట.

Advertisement

ఇది చెప్పే సమయానికి ఈ జంట ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. బాసర ఐఐఐటీలో విద్యార్థిని ఆత్మ**హ**త్య చేసుకునే ఘటనలో ప్రేమ కీలక పోషించింది. ఆమె సూసైడ్ నోట్ లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాసుకున్న చివరి వీలునామా  కన్నీళ్లు తెప్పిస్తుంది. వివరాల్లోకి వెళ్లితే.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దవ్వూరుకు చెందిన శిరీష బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమెకు తన బావ ఆకాశ్ అంటే ఎంతో ఇష్టం. వారిద్దరికీ ఒకరంటే ఒకరు చచ్చేంత ప్రేమ. ఇటీవల అతడు మరణించాడు. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన బావ లేకపోవడంతో శిరీష తల్లడిల్లిపోయింది. అతడు లేని జీవితం వద్దనుకొని.. ఉరేసుకుంది. చనిపోయే ముందు రాసుకున్న లేఖ పోలీసులకు లభించింది. ‘నాన్న..  నేను ఇలా చేయడం తప్పు ని తెలుసు. నన్ను క్షమించండి. బావ లేని జీవితనం నాకు శూన్యం. నేను తన దగ్గరికీ వెళ్లిపోతున్నా. బావ చావుకు కారణమైన వారిని అస్సలు వదలకండి. నా చివరి కోరిక తీర్చండి.

Advertisement

 

బావను చివరిసారిగా కూడా చూడలేకపోయాను. అందుకే నన్ను బావని దహనం చేసిన చోటే కాల్చండి. ప్లీజ్ నాన్న మేము బతికి ఉన్నప్పుడు ఎలాగో కలిసి లేము. కనీసం చనిపోయాక అయినా కలిసి ఉంటాం. ఎవ్వరికో భయపడి నేను చనిపోవడం లేదు. నాకు బావ కావాలి. అతని ప్రేమ కావాలి. బావ లేకుండా నేను ఉండలేను. నాను నువ్వు, అమ్మ ఎంతో బావ కూడా అంతే నాన్న. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో’ అని రాసింది. ఈ నోట్ చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు తల్లిదండ్రులు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నోట్ వైరల్ అవుతోంది.

Also Read :  అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Visitors Are Also Reading