పారిశ్రామికవేత్త జయరాం హత్య దోషులకు ఇవాళ శిక్ష ఖరారు కానుంది. ఇప్పటికే రాకేష్‌రెడ్డిని నాంపల్లి కోర్టు దోషిగా తేల్చింది. మిగతా 11 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సిసోడియాను ప్రశ్నించనుంది. ఈడీ కార్యాలయలంలో రామచంద్రపిళ్లై ఉన్నారు. మూడు రోజులుగా రామచంద్రపిళ్లైని ఈడీ ప్రశ్నిస్తోంది. సౌత్ లాబీపై పిళ్లైను ఈడీ అధికారులు విచారించనున్నారు.
Advertisement
ప్రముఖ దర్శకనటుడు సతీష్ కౌశిక్ (66) కన్నుమూశారు. కొవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలతో సతీష్ కౌశిక్ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఆయన హోలీ ఆడిన మరుసటిరోజు గుండెపోటుతో మృతి చెందారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,941 మంది భక్తులు దర్శించుకున్నారు.
Advertisement
హైదరాబాద్ అన్నోజిగూడలో తాగుబోతు వీరంగం సృష్టించాడు. నవోదయ స్కూల్ దగ్గర అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాగుబోతు విక్రమ్‌పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. దాంతో తాగుబోతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. 11న ఈడీ విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా 9న హాజరు కాలేనని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా నేరుగా ఈడీ ఆఫీస్‌కు రమ్మంటున్నారని…. ఇంత హడావిడిగా విచారణ చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. రాజకీయ కక్షలో భాగంగానే తనకు ఈడీ నోటీసులు అందజేశారని అన్నారు.
నేడు వైసీపీ శాసన మండలి అభ్యర్థులు నామినేషన్ లు వేయనున్నారు. గురువారం ఏడుగురు ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేయనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇన్స్ట్రాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే దీనిపై మెటా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.