టీఎస్‌సీఎస్సీ కేసులో రేణుక బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో తీర్పు ఇవ్వనుంది. ఆమె అనారోగ్యంతో ఉందని, ఇద్దరు చిన్నపిల్లల బాగోగులు చూసే వారు లేరని బెయిల్ రేణుక తరఫు న్యాయవాది బెయిల్ కోరారు. అంతే కాకుండా రేణుక సిట్ విచారణకు సహకరిస్తుందని తెలిపారు.
నేడు సంగారెడ్డిలోని బీజేపీ కార్యాలయాన్ని జేపీ నడ్డా వర్చువల్ గా ప్రారంభించనున్ననారు. సంగారెడ్డితో పాటు వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబ్‌బాద్‌లోని కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు.
Advertisement
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాజకీయం హీటెక్కింది. ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి అసమ్మతి నేతలు సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే ఉదయగిరి సెంటర్‌కు రావాలని సవాల్ చేశారు. వస్తే ఎవరేం చేస్తారో చూస్తానని ఎమ్మెల్యే అంటున్నారు.
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో బాలికపై వివాహితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలికి కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించి 5నెలల గర్భిణీ అని డాక్టర్లు నిర్దారించారు.
Advertisement
తిరుమలలో 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 60,699 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
కడప ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో నేడు ధ్వజారోహణం నిర్వహిస్తున్నారు. సాయంత్రం శేష వాహన సేవను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
నేడు భద్రాచలంలో శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ తమిళిసై హాజరుకానున్నారు.
నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరగనుంది. కాగా ఎమ్మెల్సీలుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, చల్లా వెంకట్రాంరెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవాళ బంద్.. బోయ, వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌కు ఆదీవాసీల పిలుపు