తాను కాంగ్రెస్ లో చేరడం లేదని డీఎస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. తన కొడుకు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు.
సింగపూర్ కు చెందిన ఉపగ్రహాన్ని ప్రవేశపెడతామని దీనికి సంబంధించి పని జరుగుతోందని ఇస్రో చైర్మెన్ డా సోమనాథ్ వెల్లడించారు. మార్క్ 3 రాకెట్ ద్వారా మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేస్తామని అన్నారు. జి.ఎస్.ఎల్.వి.మార్క్ 3 రాకెట్ ను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
Advertisement
శ్రీహరికోట రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను జిఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ ప్రవేశపెట్టింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోగం జరిగింది.
ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. దీక్షలో ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొనబోతున్నారు.
కాంచీపురం టపాకాయల గౌడౌన్ పేలుడులో భారీ పేలుడు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 11 కు చేరుకుంది. మరికొంతమంది తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Advertisement
తిరుమలలో 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న 77,856 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
విజయవాడ గన్నవరం-షిర్డీ విమాన సర్వీసు ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 72 మందితో షిర్డీకి ఇండిగో విమానంను ప్రారంభించారు. ప్రతిరోజూ రెండు సర్వీసులు నడవనున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 12.25కి గన్నవరంలో బయల్దేరి 3 గం.లకు షిర్డీకి వెల్లనుంది.
విశాఖ ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా G20 మారథాన్ జరుగుతోంది. మారథాన్ ను మంత్రులు ఆదిమూలపు సురేష్,విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.
కర్నూలులో RSS చీఫ్ మోహన్ భగవత్ పర్యటిస్తున్నారు. కొత్తపల్లి మండలం సంగమేశ్వరంలో నదీ స్నానం చేశారు. అనంతరం శ్రీలలితా సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఏప్రిల్ 8 న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సికింద్రబాద్ రైల్వే స్టేషన్ పునరుద్దరణ పనులకి శంఖుస్థాపన చేయనున్నారు. వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవంతో పాటూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.