Home » లెజెండ‌రీ డైరెక్ట‌ర్ విశ్వ‌నాథ్ గురించి చాలా మందికి తెలీని విషయాలు ఇవి..!

లెజెండ‌రీ డైరెక్ట‌ర్ విశ్వ‌నాథ్ గురించి చాలా మందికి తెలీని విషయాలు ఇవి..!

by Sravya
Ad

1949లో గుణసుందరి కథ వచ్చింది. ఈ సినిమా నిర్మాణ సమయంలో కె విశ్వనాథ్ మద్రాసులోని వాహిని స్టూడియోలో సౌండ్ డిపార్ట్మెంట్లో చేరారు. ఆ టైంలో ఎన్టీ రామారావు ఎస్వీ రంగారావు షావుకారు సినిమా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా దాదాపు ఓకే సారి కెరీర్ ని ప్రారంభించారు. సినిమాలకు సంబంధించి శిక్షణ ఇచ్చి టాలెంట్ ఉన్నవాళ్ళకి తన దగ్గర దర్శకత్వ శాఖలోకి తీసుకోవాలని ఉండేదట. అయితే ఈ టైంలో విశ్వనాధ్ ని వాహిని సంస్థలో సౌండ్ డిపార్ట్మెంట్లోకి తీసుకున్నారు సినీ రంగంలో చాలా మంది కి తెలియని విషయం ఏంటంటే వాహిని పిక్చర్స్ లో విశ్వనాథ్ తండ్రి కాశీనాధుని సుబ్రహ్మణ్యం కూడా పని చేసారు. అయితే రెడ్డికి సమకాలీకులు. విశ్వనాధ్ ని బి యన్ రెడ్డి మొదటి టెక్నిషన్ కింద ఎంచుకుని తర్వాత దర్శకత్వ శాఖలోకి తీసుకురావాలని అనుకున్నారు.

Advertisement

బంగారు పాప, మల్లీశ్వరి వంటి సినిమాలను నిర్మిస్తున్నప్పుడు విశ్వనాధ్ పలువురు ప్రముఖులతో పనిచేశారు. సౌండ్ రికార్డింగ్ అన్నది సినిమా నిర్మాణంలో ఒక భాగం. డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు రీ రికార్డింగ్ కూడా ధైర్యంగా విశ్వనాధ్ కి అప్పగించి వెళ్లేవారు. స్వప్న సుందరి, లైలా మజ్ను, తోడికోడళ్ళు వంటి సినిమాకి సౌండ్ రికార్డిస్ట్ గా పని చేయడంతో నాగేశ్వరరావు తో పరిచయం కాస్త సన్నిహితంగా మారింది.

Advertisement

Also read:

Also read:

ఆదుర్తి సొంత సినిమా మూగమనసులు స్క్రిప్ట్ డిస్కషన్స్ లో ప్రతిరోజు ఆఫీస్ అవ్వగానే సాయంత్రం పూట విశ్వనాథ్ పాల్గొనే వారట. 1966 లో అక్కినేని హీరోగా అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ఆత్మగౌరవం సినిమాతో డైరెక్టర్ గా విశ్వనాథ్ పరిచయం అయ్యారు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్ని తెర మీదకి తీసుకురావడం మొదలుపెట్టారు. అదంతా కూడా మనకి తెలిసిన విషయాలే ఇలా కెరియర్ ని మొదలు పెట్టిన విశ్వనాధ్ తెలుగు సినిమా గౌరవాన్ని పెంచిన దర్శకుల్లో ఒకరుగా లెజెండ్రీ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading