Home » చిరంజీవి పార్టీలకి హీరోయిన్స్ ని మాత్రమే పిలుస్తాడు ! పార్టీ పెట్టి వేల కోట్లు దోచుకున్నాడు !

చిరంజీవి పార్టీలకి హీరోయిన్స్ ని మాత్రమే పిలుస్తాడు ! పార్టీ పెట్టి వేల కోట్లు దోచుకున్నాడు !

by Bunty

తమిళ స్టార్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మరో వివాదానికి తెరలేపాడు. ఇప్పటికే త్రిష విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ ఖాన్… హీరోయిన్ త్రిష కు సపోర్ట్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హీరోయిన్ త్రిష కు సపోర్ట్ గా నిలిచినందుకు చిరంజీవిపై నోరు పారేసుకున్నాడు మన్సూర్ అలీ ఖాన్. తాజాగా మీడియాతో మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశాడు.

chiranjeevi

చిరంజీవి ప్రతి ఏడాది హీరోయిన్స్ తో పార్టీలు చేసుకుంటారని ఆగ్రహించారు. నేను ఆయనతో నటించానని… కానీ ఎప్పుడూ నన్ను పిలవలేదని మండిపడ్డారు. హీరోయిన్లతో మాత్రమే పార్టీలు చేసుకునేవాడని కూడా తేల్చి చెప్పారు. ఆయన కేవలం హీరోయిన్స్ ను మాత్రమే పార్టీలకు పిలుస్తారని… వారితో ఎంజాయ్ చేస్తాడని కూడా మనసూర్ అలీ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫాన్స్… మన్సూర్ అలీ ఖాన్ పై విరుచుకుపడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి లాంటి మంచి మనిషి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చురకలాంటిస్తున్నారు. హీరోయిన్ త్రిష కు సపోర్ట్ చేసినందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావా ? అని మండిపడ్డారు. కాగా ఇటీవల కాలంలోనే హీరోయిన్ త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మన్సూర్ అలీ ఖాన్ పై… హీరోయిన్ కుష్బూ మరియు మెగాస్టార్ చిరంజీవి కూడా మండిపడ్డారు. అటు రోజా కూడా త్రిష కు మద్దతు తెలిపారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading