Home » మ‌నోజ్ మౌనిక‌ మొద‌ట ఎక్క‌డ క‌లుసుకున్నారో తెలుసా..? వీరి రెండో పెళ్లికి అస‌లు కార‌ణం ఏంటంటే..?

మ‌నోజ్ మౌనిక‌ మొద‌ట ఎక్క‌డ క‌లుసుకున్నారో తెలుసా..? వీరి రెండో పెళ్లికి అస‌లు కార‌ణం ఏంటంటే..?

by AJAY
Ad

మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ రీసెంట్ గా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మార్చి 3న మ‌నోజ్ త‌న ప్రియురాలు మౌనికారెడ్డిని వివాహం చేసుకున్నాడు. బంధుమిత్రులు మ‌రియు రాజ‌కీయ సినీప్ర‌ముఖులు వీరి వివాహానికి హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. అయితే వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహం అన్న సంగ‌తి చాలా మందికి తెలియదు. మ‌నోజ్ కు మొద‌ట ఓ యువ‌తితో వివాహం అయ్యింది. కానీ ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో విడిపోయారు. అంతే కాకుండా భూమా మౌనికారెడ్డికి ఇప్ప‌టికే వివాహం కాగా ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

ALSO READ :మళ్ళీ ప్రభాస్ కు అనారోగ్యం..?

Advertisement

కాగా ఇద్ద‌రూ విడాకులు తీసుకుని మ‌ళ్లీ కొత్తజీవితంలోకి అడుగుపెట్ట‌డంతో అసలు ఇద్ద‌రికీ ఎప్పుడు ప‌రిచ‌యం ఏర్ప‌డింది..? అస‌లు ఇద్ద‌రికీ ఎందుకు విడాకులు అయ్యాయి..? ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అయితే మ‌నోజ్ మౌనిక‌లు వివాహం చేసుకున్న త‌ర‌వాత క‌లిసి తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

ద‌ర్శ‌నం అనంత‌రం మ‌నోజ్ మీడియాతో మాట్లాడుతూ….ప‌న్నెండేళ్లుగా త‌మ మ‌ధ్య ప‌రిచ‌యం ఉంద‌ని…నాలుగేళ్లుగా చాలా బాధ‌ప‌డ్డామ‌ని అన్నారు. మౌనికారెడ్డికి 2016లో గ‌ణేష్ అనే వ్య‌క్తితో ఎంగేజ్మెంట్ జ‌రిగింది. ఈ ఎంగేజ్మెంట్ కు మంచు ల‌క్ష్మి మ‌రియు మ‌నోజ్ హాజ‌ర‌య్యారు. కాగా మ‌నోజ్ మౌనిక‌లకు విదేశాల్లో ఉన్న‌ప్పుడే ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది.

వీరిద్ద‌రూ న్యూయార్క్ ఫిల్మ్ అకాడ‌మీలో చ‌దువుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆ స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ట‌. ఆ స్నేహం ప్రేమ‌గా మారే టైమ్ కు మౌనిక‌కు ఇంట్లో వాళ్లు పెళ్లి సెట్ చేశార‌ట‌. అంతే కాకుండా మ‌నోజ్ కు ఇంట్లోవాళ్లు ప్ర‌ణ‌తిరెడ్డిని సంబంధం చూశారు. అలా ఇద్ద‌రూ మొద‌ట ప్రేమించుకున్న‌ప్ప‌టికీ పెద్ద‌ల మాట కాద‌న‌లేక వేరేవాళ్ల‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు రెండో పెళ్లితో మ‌ళ్లీ ఒక్క‌ట‌య్యారు.

ALSO READ :నందమూరి తారకరత్న చేసిన తప్పే మంచు మనోజ్ చేస్తున్నాడా ? అసలు ఏం జరగబోతుంది..!

Visitors Are Also Reading