Home » “మ‌న్మ‌ధుడు” సినిమా హీరోయిన్ మ‌హి ఇప్పుడు ఎక్క‌డ ఉందో…? ఏం చేస్తుందో తెలుసా..?

“మ‌న్మ‌ధుడు” సినిమా హీరోయిన్ మ‌హి ఇప్పుడు ఎక్క‌డ ఉందో…? ఏం చేస్తుందో తెలుసా..?

by AJAY
Ad

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా రాణించిన‌వాళ్లు ప్ర‌స్తుతం పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితంలో బిజీ అయ్యారు. మ‌రికొంత‌మంది మాత్రం సీరియ‌ల్స్ లో సినిమాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లుగా న‌టిస్తున్నారు. కొంత‌మంది అయితే అస‌లు అడ్ర‌స్ లేకుండా పోయారు. సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండ‌టం లేదు. అలా సోష‌ల్ మీడియాకు దూరంగా అస‌లు అడ్ర‌స్ లేకుండా పోయిన హీరోయిన్ ల‌లో మ‌న్మ‌ధుడు హీరోయిన్ అన్షు అంబాని కూడా ఒక‌రు.

Advertisement

మ‌న్మ‌ధుడు సినిమాలో అన్షు అంబాని మ‌హి అనే పాత్ర‌లో న‌టించింది. సినిమాలో అమాయ‌క‌పు ముకంతో అందం అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. సినిమాలో త‌క్కువ సేపు మాత్ర‌మే క‌నిపించినప్ప‌టికి అన్షు అంబాని ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. మ‌న్మ‌ధుడు సినిమాతో పాటూ అన్షు అంబాని ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రాఘ‌వేంద్ర సినిమాలో కూడా హీరోయిన్ గా న‌టించి అల‌రించింది.

Advertisement

ఇక తెలుగులో రెండు మూడు సినిమాలే చేసిన అన్షు అంబాని త‌మిళ్ లోనూ ఒక‌టి రెండు సినిమాలే చేసింది. ఆ త‌ర‌వాత మాత్రం అన్షు అంబాని ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌కుండా పోయింది. కానీ అప్పుడ‌ప్పుడూ అన్షు ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతూ ఉంటాయి. నిజానికి అన్షు అంబాని లండ‌న్ లోనే పుట్టి అక్క‌డే పెరిగింది. ఆ త‌ర‌వాత ఇండియాకు వ‌చ్చి సినిమాల్లో ఆఫ‌ర్స్ అందుకుంది.

హీరోయిన్ గా స‌క్సెస్ అవ్వ‌క‌పోయినా ఒక‌టి రెండు సినిమాలు చేసి చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. ఇక ప్ర‌స్తుతం అన్షు స‌చిన్ స‌గ్గార్ అనే వ్యాపార‌వేత్త‌ను వివాహం చేసుకుని మ‌ళ్లీ లండన్ లోనే సెటిల్ అయ్యింది. అంతే కాకుండా అన్షు ఇన్స్పిరేష‌న్ కౌచ‌ర్ అనే డిజైనింగ్ షాప్ ను నిర్వ‌హిస్తోంది. ఇక ఇటీవల రీసెంట్ గా సోష‌ల్ మీడియాలో దర్శ‌నం ఇచ్చింది. త‌న ఫ్యామిలి తో ఉన్న ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వారికి ఒక పాప‌, బాబు ఉన్నారు.

ALSO READ : చిరంజీవి న‌టించిన సినిమాల్లో బాల‌య్య‌కు చాలా ఇష్ట‌మైన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..?

Visitors Are Also Reading