సినిమా హీరోలకు అంటే పాతికేళ్ల నుండి డెబ్బై ఏళ్ల వరకూ కూడా హీరో అవకాశాలు వస్తుంటాయి. ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరో ముసలితనం లో ఉన్నా హీరోగానే చూడాలని కోరుకుంటారు. కానీ హీరోయిన్ లకు మాత్రం అలా ఉండదు. పాపం మూడు పదుల వయసు దాటిందంటే మెల్లి మెల్లిగా హీరోయిన్ ఆఫర్ లు తగ్గిపోతుంటాయి. ఆ తరవాత చేస్తే ఆంటీ పాత్రలు, అక్క వదిన పాత్రలు చేయాల్సిందే.
లేదంటే రిటైర్ మెంట్ తీసుకోవాల్సిందే. కాబట్టి చేసినంత కాలం హీరోయిన్ గానే చేసి కొంతమంది ముద్దుగుమ్మలు సినిమాలకు దూరం అవుతారు. అలా తన అందచందాలతో అభిమానులను సంపాదించుకుని అవకాశాలు తగ్గడంతో సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరోయిన్ అన్షు అంబానీ…ఏంటీ ఈ పేరు ఎక్కడా విన్నట్టు లేదు కదా….అన్షు అంటే మరెవరో కాదు మన్మథుడు సినిమాలో నాగార్జునకు జోడీగా అమాయకంగా నటించిన హీరోయినే.
Advertisement
Advertisement
ఈ సినిమాలో అన్షు సాంప్రదాయబద్దంగా కనిపిస్తూ అన్షు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాతో పాటూ అన్షు ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ రెండు సినిమాలలో కూడా అన్షు కు స్క్రీన్ స్పేస్ తక్కువే ఉంటుంది. ఈ సినిమాల తరవత మిస్సమ్మ అనే మరో సినిమాలో అన్షు నటించింది. ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర నిడివి తక్కువే.
అన్షు తెలుగులోనే కాకుండా కన్నడ లోనూ కొన్ని సినిమాలు చేసింది. ఆ తరవాత పెద్దగా ఆఫర్ లు లేకపోవడంతో మెల్లి మెల్లిగా సినిమాలకు దూరం అయ్యింది. ఇక నటనకు గుడ్ బై చెప్పిన తరవాత చాలా మంది హీరోయిన్ లు ఎన్నారైలను బడా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకోవడం సాధారణమే అన్షు కూడా అదే ఫార్ములాను ఫాలో అయింది. అన్షు లండన్ కు చెందిన సచిన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరు లండన్ లోనే సెటిల్ అవ్వగా వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ALSO READ:
దేవుళ్ళు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా.?
సురేఖతో పెళ్లి కోసం చిరంజీవి పై నిఘాపెట్టిన తండ్రీ కొడుకులు..!