Home » చిరంజీవి సినిమాల్లో మంచు విష్ణు కి ఈ సినిమాని రీమేక్ చెయ్యాలని ఉందట … ఇది అయ్యే పనేనా ?

చిరంజీవి సినిమాల్లో మంచు విష్ణు కి ఈ సినిమాని రీమేక్ చెయ్యాలని ఉందట … ఇది అయ్యే పనేనా ?

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఒక పక్క మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఇంకో పక్క సినిమాలతో బిజీగా ఉన్నారు. కన్నప్ప సినిమా మంచు విష్ణు కెరియర్ లోని క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో సొంత నిర్మాణంలో మంచి విష్ణు ఈ సినిమాని తెరమీదకి తీసుకొస్తున్నారు. మంచి ఫ్యామిలీ హీరో కనుక మంచి విష్ణు తరుచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ట్రోలింగ్ కి కూడా గురువుతూ ఉంటారు.

chru

Advertisement

 

టాలీవుడ్ లో తన తండ్రి తో పాటుగా సీనియర్ హీరోలు అందరూ తనకి ఆదర్శమని మంచి విష్ణు చెప్పారు. సీనియర్ హీరోల సినిమాలు కొన్ని రీమేక్ చేయాలని ఆయనకి ఉన్నట్లు మనసులో మాట బయటపెట్టారు. భైరవద్వీపంలో బాలకృష్ణ గారి పాత్ర అంటే చాలా ఇష్టమని ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయని అవకాశముంటే ఆ పాత్ర చేయాలని నా కోరిక అని మంచు విష్ణు చెప్పారు. నాన్నగారు సినిమాల్లో అల్లుడుగారు గాని అసెంబ్లీ రౌడీ కానీ రీమేక్ చేయాలని ఉంది అని చెప్పారు.

Also read:

Advertisement

Also read:

వెంకటేష్ గారి సినిమాల్లో చంటి అంటే ఇష్టమని నాగార్జున సినిమాల్లో అందరూ గీతాంజలి అంటూ ఉంటారు కానీ అన్నమయ్య నెక్స్ట్ లెవెల్ అని విష్ణు చెప్పారు. చిరంజీవి సినిమాల్లో అయితే జగదేకవీరుడు అతిలోకసుందరి బెస్ట్ మూవీ అందులో డౌట్ లేదు అని అన్నారు నాతో పాటు అందరికీ ఆ సినిమా అంటే చాలా ఇష్టం. కానీ చిరంజీవి కె విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అంటే పిచ్చి. ఆ మూవీస్ లో ఏదో ఒకటి రీమేక్ చేయాలని ఉందని విష్ణు చెప్పారు. విశ్వనాధ్ చిరంజీవి కాంబినేషన్లో ఆపద్బాంధవుడు స్వయంకృషి వంటి చాలా సినిమాలో అన్ని క్లాసిక్ చిత్రాల పేర్లు చెప్పారు ఆ మూవీస్ ని రీమిక్స్ చేసి ఆ స్థాయిలో మెప్పించడం అంటే మామూలు విషయం కాదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading