మంచు వారి కుటుంబంలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. మోహన్ బాబు రెండవ కుమారుడు హీరో మంచు మనోజ్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మనోజ్ తన మొదటి భార్య ప్రణీతకు విడాకులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. విడాకుల తర్వాత మన టిడిపి సీనియర్ నాయకుడైన భూమా నాగిరెడ్డి రెండో కూతురు మౌనిక రెడ్డితో లవ్ లో పడ్డారు. వీరి వివాహం మార్చి 3న జరగనుంది. అయితే ఈ పెళ్లి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక విషయం తెగ చర్చకు వస్తోంది.
READ ALSO : చైనాలో 40 కోట్లకు పైగా పెళ్లి కాని ప్రసాద్ లు… కారణం ఇదే!
Advertisement
అదే మనోజ్, మౌనికల పెళ్లి. మంచు ఫ్యామిలీకి ఇష్టం ఉందా? మనోజ్, మౌనికల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిన నాటి నుంచి మోహన్ బాబు సీరియస్ గా ఉన్నాడని టాక్ వచ్చింది. ఈ పెళ్ళికి ఎట్టి పరిస్థితుల్లో తాను ఒప్పుకునే అవకాశం లేదని మోహన్ బాబు చాలాసార్లు చెప్పాడట. దీంతో మోహన్ బాబు, మనోజ్ మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయట. దీంతో మనోజ్ ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోయాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఇప్పుడు పెళ్లి కూడా మంచు మోహన్ బాబు ఇంట్లో జరగడం లేదట.
Advertisement
READ ALSO : Samantha: సమంత చేతులకు గాయాలు.. రక్తంతో షాకింగ్ పోస్ట్
మనోజ్ అక్క మంచు లక్ష్మి ఇంట్లో పెళ్లి జరుగుతుందని సమాచారం. అయితే ఈ పెళ్లికి మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా రావడం అనుమానమే అని తెలుస్తోంది. మనోజ్, మౌనిక పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయట. అందులో రాజకీయపరమైన కారణాలు కూడా ఉన్నాయని సమాచారం. టిడిపి బ్యాక్ గ్రౌండ్ ఉన్న మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం వల్లే మంచు కుటుంబం వ్యతిరేకిస్తుందట. కాగా మొదటి నుంచి మంచు కుటుంబం వైసీపీకి సపోర్టుగా ఉన్న సంగతి తెలిసిందే.
READ ALSO : నందమూరి కుటుంబంలో ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా…?