Home » మంచు మనోజ్ దంపతులకు కవల పిల్లలు.. పోస్ట్ వైరల్!

మంచు మనోజ్ దంపతులకు కవల పిల్లలు.. పోస్ట్ వైరల్!

by Anji
Ad

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనిక దంపతులకు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. మౌనిక కవల పిల్లలకు జన్మనివ్వబోతుందంటూ నెట్టింట నెటిజన్లు హంగామా చేస్తున్నారు. దీంతో తాజాగా స్పందించిన మనోజ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Advertisement

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా దీనిపై పోస్ట్ పెట్టిన మనోజ్.. ‘దయచేసి మా విషయంలో మీరు ఎలాంటి రూమర్స్‌ నమ్మకండి. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం. మాకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం తన భార్య మౌనిక ఏడో నెల గర్భంతో ఉంది. ఈ ఏడాది మే నెలలో మా ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమ, అప్యాయత, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ మనోజ్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Also Read :  బిగ్ బాస్ శివాజీ ఎంత మందికి డబ్బింగ్ చెప్పారో తెలుసా ?

Visitors Are Also Reading