సెలబ్రెటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఎప్పుడు విడిపోతారో చెప్పలేం. అంతే కాకుండా చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకుని విడాలకులు తీసుకుని ఆ తరవాత మరొకరిని పెళ్లాడి కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటారు. మరికొందరు సింగిల్ గానే ఉండిపోతారు. ఇక ఇప్పుడు మంచు మనోజ్ కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్ కు ఇదివరకే ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది వీరిద్దరూ మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు కూడా గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి: సలార్ మొత్తం ప్రభాస్ డూప్ తోనేనా..?
Advertisement
ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ విడిపోయారు. ఇదిలా ఉండగా మనోజ్ ఆదివారం నాడు రాజకీయనేత దివంగత భూమానాగిరెడ్డి కుమార్తె మౌనికారెడ్డితో కలిసి సీతాఫల్ మండిలో తన స్నేహితుడు ఏర్పాటు చేసిన గణేశ్ మండపానికి వచ్చి పూజ చేశారు. దాంతో వీరిద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి: బ్రహ్మాస్త్ర కోసం రాజమౌళి పడుతున్న కష్టం వెనుక అసలు కారణం తెలుసా..?
గతంలో మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపించాయి కానీ మనోజ్ ఆ వార్తలను ఖండించారు. కాగా మౌనికారెడ్డితో వినాయకుడిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెళ్లి గురించి తరవాత మాట్లాడతానని అన్నారు. ఇదిలా ఉండగా మౌనికారెడ్డి మనోజ్ లకు మూడేళ్ల నుండి పరిచయం ఉందట. మూడేళ్ల క్రితం మౌనికారెడ్డితో మనోజ్ కు చెన్నై లో పరిచయం ఏర్పడిందట.
ఆ తరవాత వీరిద్దరూ ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ వచ్చిన తరవాత వీరిద్దరూ కలుసుకునేవారని టాక్. కానీ కేవలం ఆదివారాలలో మాత్రమే కలుసుకునేవారని తెలుస్తోంది. ఇక త్వరలోనే వీరిద్దరి వివిహానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకావాలు ఉన్నాయని సమాచారం.
ఇవి కూడా చదవండి: త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?