Telugu News » Blog » బ్రహ్మాస్త్ర కోసం రాజమౌళి పడుతున్న కష్టం వెనుక అసలు కారణం తెలుసా..?

బ్రహ్మాస్త్ర కోసం రాజమౌళి పడుతున్న కష్టం వెనుక అసలు కారణం తెలుసా..?

by Manohar Reddy Mano
Ads

దర్శక ధీరుడు రాజమౌళి గురించి కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మొత్తం ఇండియా వ్యాప్తంగా అందరికి బాగా తెలిసిన పేరు. మొదట బాహుబలి సినిమాతో మొత్తం ఇండియాను షేక్ చేసిన రాజమౌళి ఇక ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో మళ్ళీ తన సత్తా ఏంటి అనేది అందరికి పరిచయం చేసాడు. ఆలాంటి రాజమోళి ప్రస్తుతం బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు.

Advertisement

బ్రహ్మాస్త్ర సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ హీరోగా నటించించాడు. మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమా అనేది రానుంది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి బాగానే శ్రమిస్తున్నాడు. కేవలం ఈ సినిమా ప్రమోషన్స్ లోనే కాకుండా.. ఎడిటింగ్ లో కూడా రాజమౌళి పని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి పడుతున్న ఈ కష్టం వెనుక పెద్ద కారణం ఉంది అని తెలుస్తుంది.

Advertisement

అయితే రాజమౌళి ఈ బ్రహ్మాస్త్ర సినిమా కథ విషయంలో చాలా నమ్మకంతో.. దీని బిజినెస్ లోకి దూరినట్లు తెలుస్తుంది. బ్రహ్మాస్త్ర సినిమా యొక్క డిస్ట్రిబ్యూషన్ లో రాజమౌళి భాగం అయ్యినట్లు సమాచారం. అందుకే తాను డైరెక్ట్ చేసిన సినిమాతో సమానంగా ఈ బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు రాజమౌళి. నిజం చెప్పాలి అంటే.. తన సినిమా కంటే ఎక్కువగానే బ్రహ్మాస్త్ర సినిమాకు ప్రమోషన్స్ అనేవి చేస్తున్నాడు రాజమౌళి.

Advertisement

ఇవి కూడా చదవండి :

రైనా పేరిట ఉన్న ఈ రికార్డులు మీకు తెలుసా..?

ట్రోల్స్ ను చూసి నవ్వుకుంటున్న అర్ష్‌దీప్..!