చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడూ ఎవరోఒకరు నోరు విప్పుతూనే ఉంటారు. ఎక్కువగా కెరీర్ ముగిసిన హీరోయిన్లు తాము కాస్టింగ్ కౌచ్ ను ఎదురుకున్నామని చెబుతుంటారు. అయితే తాజాగా మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్షి సైతం కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం సంచలనంగా మారింది. మంచు లక్షి తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని షాకింగ్ కామెంట్లు చేసింది.
Advertisement
మహిళా దినోత్సవం సందర్భంగా మంచు లక్షి జాతీయ మీడియాతో ముచ్చటిచ్చింది. ఈ సంధర్బంగా ఆసక్తికర కామెంట్లు చేసింది. మోహన్ బాబు కుమార్తెగా తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదురుకున్నా అంటూ కామెంట్లు చేసింది.
Advertisement
అంతే కాకుండా తను శరీరాకృతి గురించి కూడా బాడీ షేమింగ్ ను ఎదురుకున్నానంటూ వ్యాఖ్యానించింది. సినిమా బ్యాగ్రౌండ్ నుండి వచ్చింది కాబట్టి తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంతా అనుకుంటారు. కానీ అవన్నీ అబద్దాలు అని పేర్కొంది. ఇక కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ రంగంలోనే కాదని అన్ని రంగాలలో కూడా ఉంటుందని వ్యాఖ్యానించింది.
ఇప్పటికీ తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నా అంటూ చెప్పింది. ట్రోల్స్ బాడీషేమింగ్ అనేవి కేవలం చిత్రపరిశ్రమలోనే కాకుండా బ్యాకింగ్ ఇతర రంగాల్లో కూడా ఉంటుందని అన్నారు. కానీ ఇవేవీ మనల్ని ఆపకూడదని….ఏం పట్టించుకోకుండా ముందుకు సాగాలని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా మంచు లక్షి టీవీ షోలతో పాటూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.