తాజాగా మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడం లేదన్న విషయమై ఆమె పలు కామెంట్స్ చేసారు. తెలుగు ప్రేక్షకుల వలెనే తెలుగు వారికి అవకాశాలు రావడం లేదని ఆమె వాపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మంచు వారమ్మాయి తెలుగు నటులకు తెలుగు సినిమాల్లో అవకాశాలు రాకపోవడం గురించి మాట్లాడారు.
Advertisement
అంతే కాకుండా, నేనొక హాలీవుడ్ నటిని.. త్వరలోనే హాలీవుడ్ కి వెళ్ళిపోతాను అని చెప్పుకొచ్చారు. హాలీవుడ్లో ఒకటి, రెండు కాదు.. చాలా సినిమాలనే చేసానని చెప్పుకొచ్చారు. హాలీవుడ్ ని వదిలేసి టాలీవుడ్ కి వచ్చానని, హాలీవుడ్ లోనే ఉండి ఉంటె.. ఈ పదేళ్లలో ఎక్కడో ఉండేదాన్నని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. ఏం కర్మ పట్టి ఇక్కడకి వచ్చేసానని ఇప్పుడు అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
Advertisement
పెళ్లయ్యాక పాప కావాలనుకున్న టైం లో ఇక్కడకు వస్తే మంచిందని అనిపించిందని, ఇప్పుడు పాపకి తొమ్మిదేళ్లు వచ్చాయి.. నాకు రెక్కలు వచ్చినట్లుందన్నారు. ఇక్కడ ఉంటె ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నట్లు ఉంటుందని వచ్చేశానన్నారు. అక్కడే ఉండి ఉంటె వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు. దేవుడు దయ తలిస్తే హాలీవుడ్ కి వెళ్లిపోతానని, ఇక్కడ ఉండనని చెప్పుకొచ్చారు. తెలుగు ఆడియన్స్ వేరే ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన నటులను ప్రేమిస్తారని, తెలుగు అమ్మాయిలు వీరికి నచ్చారని కామెంట్స్ చేసారు. మధు శాలిని, బిందు మాధవి, శివాని, నిహారిక లాంటి తెలుగు అమ్మాయిలు సినిమాలు ఎందుకు చేయడం లేదు? తెలుగు వాళ్ళకి తెలుగు అమ్మాయిలు నచ్చడం లేదన్నారు. అక్కడే సమస్య వస్తోందన్నారు. పోనే నేనే ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టి తెలుగు అమ్మాయిలకు అవసకసలు ఇద్దామా అనుకుంటే.. నాది నాకు చూసుకోవడానికి లేదని అన్నారు. ప్రస్తుతం నిహారిక ట్రేండింగ్ లో ఉండడంతో.. ఆమె ప్రస్తావన తీసుకొచ్చేసరికి మంచు అక్క కామెంట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ముఖ్య వార్తలు:
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు
Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..