తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని తరాలుగా నటులుగా కొనసాగుతున్న ఫ్యామిలీల్లో నందమూరి, మంచు, మెగా, అక్కినేని ఫ్యామిలీలు ఉన్నాయి.. ఈ ఫ్యామిలీలో మంచు మరియు అక్కినేని ఫ్యామిలీకి ఆ ఒక్కటి మాత్రం అస్సలు కలిసి రావడం లేదు.. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ వచ్చిన మంచు మోహన్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఆయనకు మొదటి పెళ్లి కలిసి రాలేదు. ఆయన మొదటి భార్యగా విద్యాదేవిని చేసుకున్నారు. కానీ ఆమె అకస్మాత్తుగా మరణించడంతో, మంచు లక్ష్మి, విష్ణు చిన్న పిల్లలుగా ఉన్నారు.
also read:భూమా మౌలిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా… మనోజ్ కంటే ఎక్కువైనా?
Advertisement
దీంతో వారికి తోడు కావాలని నిర్మల దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. అలాంటి మోహన్ బాబు కుమారుడైన మంచు మనోజ్ కూడా మొదటి పెళ్లి కలిసి రాలేదు. ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ ఇద్దరి మధ్య కుదరకపోవడంతో విడాకులు ఇచ్చేశాడు. తాజాగా మనోజ్ భూమా మౌనిక రెడ్డికి రెండో వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీలో కూడా అక్కినేని నాగార్జున ముందుగా మొదటి భార్యగా వెంకటేష్ చెల్లెలు లక్ష్మీని చేసుకున్నారు.
Advertisement
also read:టాలీవుడ్ లో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి
నాగచైతన్య జన్మించిన తర్వాత వీరి మధ్య కుదరకపోవడంతో డైవర్స్ తీసుకొని నాగార్జున మళ్ళీ అమలను రెండో పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ కీర్తి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కలిసి రాకపోవడంతో విడాకులు ఇచ్చాడు. ఇక ఇతని సోదరి సుప్రియ కూడా చరణ్ అనే వ్యక్తిని పెళ్ళాడి ఇద్దరి మధ్య కుదరకపోవడంతో ఆయనకి విడాకులు ఇచ్చింది. ఇక మరో హీరో నాగచైతన్య. సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నేళ్లు కలిసి ఉండి , ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఇలా మంచు ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి మొదటి పెళ్లి కలిసి రాలేదు.
also read: