Home » “మనసంతా నువ్వే” చిన్నారి ఇప్పుడు యెంత అందంగా మారిపోయిందో తెలుసా ?

“మనసంతా నువ్వే” చిన్నారి ఇప్పుడు యెంత అందంగా మారిపోయిందో తెలుసా ?

by Bunty
Ad

 

మనసంతా నువ్వే సినిమాలో తూనీగా తూనీగా పాటతో ఫేమస్ అయినటువంటి చిన్నారి ఆ సినిమాలో నటించి ఎంతో ఫేమస్ అయిపోయింది. ఆ చిన్నారి పేరు సుహాని. ఈ చిన్నారి అతిచిన్న వయసులోనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మనసంతా నువ్వే సినిమా అనంతరం ప్రేమంటే ఇదేరా, ఎదురులేని మనిషి, ఎలా చెప్పను వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రను పోషించింది. దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా 12 సినిమాల్లో నటించింది.

Manasantha Nuvve Child Artist Suhani Kalita

12 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాని బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డును కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరమై తన పూర్తి దృష్టిని చదువుపై పెట్టింది. చదువు పూర్తయ్యాక దాదాపు 20 ఏళ్ల తర్వాత సవాల్ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అనంతరం రెండు, మూడు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.

Advertisement

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులు పెద్దగా ఈ అమ్మడును ఆదరించలేకపోవడంతో తమిళ ఇండస్ట్రీవైపుకు మళ్ళింది. అక్కడ తమిళంలో కొన్ని సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా సక్సెస్ సొంతం చేసుకోలేకపోయింది. ఇక సినిమా అవకాశాలు రాకపోవడంతో సంగీత కళాకారుడు, మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి విబ్బర్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం సుహాని తన భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు పూర్తిగా దూరమై కుటుంబానికి తన పూర్తి సమయాన్ని కేటాయిస్తోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading