సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్లకు మరియు కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉండే నటీనటులకు ప్రత్యేకంగా మేనేజర్లు ఉంటారు. ఈ మేనేజర్లు నటీనటుల డేట్స్ మరియు రెమ్యునరేషన్ ఫైనాన్షియల్ కు సంబంధించిన అంశాలను దగ్గరుండి చూసుకుంటారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లకు మేనేజర్లు ఉండరు కానీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన తర్వాత మాత్రం కచ్చితంగా మేనేజర్ లను నియమించుకుంటారు. కాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా మేనేజర్ ఉన్నారు.
Advertisement
తమన్నా పదేళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా బిజీ గా ఉంది. తమన్నా తన ఫైనాన్షియల్ విషయాలన్నీ మేనేజర్ కే అప్పగించింది. అయితే తమన్నా సినిమాలతో బిజీగా ఉండగా ఆమె మేనేజర్ మాత్రం ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ ను చెల్లించకుండా డబ్బులను తన ఖర్చులకు ఉపయోగించుకున్నారు. అలా ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ను కట్టకపోవడంతో ప్రభుత్వం నుండి తమన్నా నోటీసులు అందుకుంది. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న తమన్నా ఏం జరిగిందని ఆరాతీస్తే మేనేజర్ చేతివాటం బయటపడింది.
Advertisement
దాంతో అప్రమత్తమైన తమన్నా వెంటనే ఫైనాన్షియల్ కు సంబంధించిన విషయాల పై కూడా శ్రద్ధ తీసుకుంటూ ఎంతో జాగ్రత్త పడింది. ఇదిలా ఉంటే కేవలం తమన్నా మాత్రమే కాకుండా ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీనటులు మేనేజర్ల వల్ల మోసపోయినట్టు తెలుస్తోంది.
ALSO READ : కల్లు తాగుతున్న బిగ్ బాస్ బ్యూటీ….వీడియో వైరల్..!
ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోలలో కూడా సందడి చేస్తోంది. టాక్ షోలు కుకింగ్ షోలు సైతం చేస్తూ బిజీగా ఉంది. అదేవిధంగా రీసెంట్ గా నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో సినిమాలో నెగిటివ్ రోల్ చేసి ఆకట్టుకుంది. మరోవైపు తమన్నా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చేతినిండా చేతి నిండా సంపాదిస్తోంది.