మానవ చరిత్రలో తొలిసారి పంది గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి రెండు నెలల తరువాత మరణించారు. ఆయనకు సర్జరీ చేసిన అమెరికాలోని మేరీ ల్యాండ్ యూనివర్సిటీ ఆస్పత్రి బుధవారం ప్రకటించింది. ఆయన మరణానికి దారి తీసిన కారణాలను వెల్లడించలేదు. 57 ఏండ్ల డేవిడ్ బెన్నెట్ కొన్నేండ్లుగా గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు గుండె ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన ఏర్పడింది. మానవుని గుండె లభించకపోవడంతో దీంతో జీన్ ఎడిటింగ్, క్లోనింగ్ విధానంలో అభివృద్ధి చేసి పంది గుండెను ఆయనకు అమర్చాలని మేరీ ల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యులు నిర్ణయించారు.
Advertisement
జనరేటివ్ మెడిసిన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న రెవివికార్ అనే కంపెనీ జన్యు మార్పిడి పందిని పేషెంట్‌కు డొనేట్ చేసింది. దీంతో జనవరి 07న సుమారు 08 గంటల సర్జరీ నిర్వహించిన అమెరికా వైద్యులు డేవిడ్ బెన్నెట్‌కు పంది గుండెను అమర్చి చరిత్ర సృష్టించారు. ఈ సర్జరీ విజయం కావడంతో ప్రపంచం నివ్వెరపోయింది. మానవ అవయవాల కొరతను జంతువుల అవయవాల ద్వారా అధిగమించవచ్చన్న ఆశ మరొకసారి చిగురించింది.
Advertisement
ఆశ ఆవిరి అయిపోయింది. డేవిడ్ బెన్నేట్ ఆరోగ్యం గత కొద్ది రోజులుగా క్షీణిస్తుందని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుప్రతి వర్గాలు వెల్లడించాయి. ఈ తరుణంలో పంది గుండె మార్పిడి చేసిన రెండు నెలల తరువాత మరణించినట్టు ప్రకటించారు. వైద్యుల చివరి ప్రయత్నాన్ని బెన్నేట్ కుమారుడు అభినందించారు. మానవ అవయవ కొరతను అధిగమించే ప్రయత్నాలకు ఇది దోహదం చేస్తోందని అభిప్రాయ పడ్డాడు. చారిత్రాత్మక ప్రయత్నం ఇక్కడితో ఆగకూడదని అన్నారు. మానవ అవయవ కొరతను అధిగమించే కొత్త ప్రయత్నాలకు ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
Also Read : Russia-Ukraine War: రష్యాకు ఎదురు దెబ్బ.. ఐఓసీ బహిష్కరణ వేటు..!