Home » కేటీఆర్ స్నేహితుడిని ఓడించిన వ్యక్తి ఎవరు అంటే…?

కేటీఆర్ స్నేహితుడిని ఓడించిన వ్యక్తి ఎవరు అంటే…?

by Sravya
Ad

ఖానాపూర్ నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రేఖ నాయక్ ఉండేవారు. మంత్రి కేటీఆర్ స్నేహితుడు జాన్సన్ నాయక్ కి స్థానానికి కేటాయించారు. దీంతో రేఖ నాయక్ భారత రాష్ట్ర సమితి అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అతన్ని ఓడించింది బొజ్జు. ఆదివాసి జిల్లాగా పేరుపొందిన ఆదిలాబాద్ లోని ఉట్నూరు మండలం కల్లూరు గూడ గ్రామం దారిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబం వాళ్లది. తల్లి తండ్రి కూలి చేసుకునే వారు. ఏమీ దొరకని నాడు పస్తులు ఉండేవారు తల్లిదండ్రులు కష్టం చూడలేక బొజ్జు పేపర్ బాయ్ గా పని చేశారు వచ్చిన డబ్బుల్ని తల్లిదండ్రులకి ఇచ్చేవారట.

Advertisement

అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో బొజ్జు కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది ఇందిరమ్మ ఇంట్లోనే నివాసం ఉండడం మొదలుపెట్టారు. గ్రాడ్యుయేషన్ దాకా చదువుకోవడం తర్వాత ఆదివాసుల సమస్యల మీద పోరాడడం వంటివి చేసేవారు తుడుం దెబ్బకి సలహాదారు స్థాయి వరకు బొజ్జూ పని చేశారు. తర్వాత కొంతకాలానికి ఇతర వ్యాపకాలు చూసుకున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్లో చేరారు మొదట్లో కాంగ్రెస్ పార్టీలో చేరితే చాలామంది హేళన చేయడం జరిగింది. నువ్వేంటి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తావ్ అంటూ నవ్వారట మంత్రి కేటీఆర్ స్నేహితుడు జాన్సన్ నాయక్ కి సీటును ఇచ్చారు.

Advertisement

దీంతో రేఖ అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీకి రాజీనామా ప్రకటించేసి కాంగ్రెస్లో చేరారు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడమే లేట్ మహబూబ్నగర్ ఎస్పీగా పని చేస్తున్న ఆమె అల్లుడిని ప్రభుత్వం బదిలీ చేసింది. బొజ్జూ రేఖ నాయక్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అధికార పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని తమ సామాజిక వర్గం వారికి అర్థమయ్యే విధంగా చెప్పారు. జాన్సన్ నాయక్ లంబాడ సామాజిక వర్గానికి చెందిన అతను. ఈ ఖానాపూర్ ప్రాంతంలో గోండు జాతి ఎక్కువ ఉంటుంది బొజ్జూ కాంగ్రెస్ నుండి పోటీ చేయడం అక్కడ ఆదివాసి సమాజం ఎక్కువ ఉండడం విజయం అందుకోవడం జరిగాయి. కేటీఆర్ స్నేహితుడికి బలాలు ఉన్నా కూడా ఓటమి తప్పలేదు. ఇక్కడ ప్రజలంతా బొజ్జు మీదే ఆసక్తి చూపించారు. ఇలా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొజ్జు విజయం సాధించారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading