భారత దేశంలో ప్రస్తుతం దేశ రాజకీయాలతో సమానంగా బీసీసీఐ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ గా గత మూడేళ్ళుగా ఉన్న సౌరవ్ గంగూలీ.. మరోసారి ఆ పదవిలో కూర్చోవాలి అనుకున్నారు. కానీ బీసీసీఐ పెద్దలు ఎదురు తిరగడంతో అది సాధ్యం కావడం లేదు. గంగూలీ తప్పు చేసాడు అని నిందరు వచ్చాయి.
Advertisement
కానీ ఈ విషయంలో బీజేపీని విమర్శించడం ప్రారంభించారు తృణమూల్ కాంగ్రెస్ నేతలు. ఇక తాజాగా దాదాకు మద్దతుగా స్వయంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చారు. అఆమే దాదాకు అన్యాయం చేస్తున్నారు అని కామెంట్స్ చేసారు. తాజాగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. గంగూలీ కేవలం బెంగాల్ కే కాదు దేశం మొత్తం గర్వకారణం. అతను ఇన్ని రోజులు క్రికెట్ కు చేసిన సేవలకు.. అతడిని ఇలా అవమానించడం సరైన పద్దతి కాదు.
Advertisement
జై షాతో మరోసారి తన పదవిలో కొనసాగుతున్నాడు. కానీ దాదాను తప్పించారు. అతనికో న్యాయం.. గంగూలీకి ఓ న్యాయమా అని ఆమె ప్రశ్నించారు. అలాగే జై షా అంటే తనకు ఏ రకమైన పగ అనేది కూడా లేదు అని ఆమె తెలిపింది. ఇక ఇప్పుడు ఇక్కడ చేసిన తప్పుకు పరిహారంగా సౌరవ్ ను ఐసీసీకి పంపించాలి అని ఆమె చెప్పింది. బీసీసీఐ నుండి ఎందరో ఐసీసీకి వెళ్లారు అని.. ఇప్పుడు సౌరవ్ ను కూడా అక్కడికి పంపించాలి అని సీఎం మమతా బెనర్జీ అన్నారు.
ఇవి కూడా చదవండి :