పెళ్లిలో అందంగా కనిపించేందుకు వధువు, వరులు ఇద్దరూ పెళ్లికి ముందు బ్యూటీ పార్లర్‌కు వెళ్లడం, స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండేందుకు కొన్ని నెలల ముందు నుంచే డైట్ మెయింటైన్ చేయడం చేస్తారు. పెళ్లికి ముందే ఫిట్‌గా ఉండాలంటే ఆహారంలో విషయంలో శ్రద్ధ వహించడం తప్పనిసరి వివాహానికి ముందు ఎలాంటి డైట్ చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
పెళ్లికి ముందు బరువు తగ్గేందుకు చాలా మంది చాలా రకాలుగా డైట్‌ను ఫాలో అవుతుంటారు. సమయానికి ఆహారం తినకుండా కడుపు మాడ్చుకోవడం వంటివి చేస్తుంటారు. ఇది పోషకాల లోపానికి కారణం అవుతుంది కూడా. సాధారణంగా బరువు తగ్గడం ముఖ్యమే కానీ మంచి ఆహారం తీసుకుంటూ ఫిట్‌నెస్ సాధించడం అంతకంటే ముఖ్యమనే విషయం గుర్తుంచుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే అసలైన ఫిట్‌నెస్ సాధించినట్టు లెక్క. నీరు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. పెళ్లికి కొన్ని నెలల ముందు నుంచే శరీరానికి తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
Advertisement
ఫిట్‌గా ఉండాలనుకునే వరుడు ఎక్కువగా తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో తీసుకోవాలి. వీటిని తినడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కొత్త ప్రయోగాలు చేయడం మానుకోండి. బరువు తగ్గడానికి ఈ రోజుల్లో చాలా ట్రిక్స్ ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లికి ముందు ఆహారంలో ఏది అయినా ప్రయత్నించడం మానుకోండి. ఈ పద్దతి మీ మీ ఆరోగ్యానికి చర్మానికి హాని కలిగిస్తుందనే విషయాన్ని గుర్తించుకోండి.
Also Read :
నయనతార విజ్ఞేశ్ శివన్ కు ఇచ్చిన గిఫ్ట్ విలువ ఎంతో తెలిస్తే షాకవుతారు..?
ఫేస్‌బుక్‌లో మారనున్న టికర్, లోగో..!