పరిచయం :
అడవి శేషు క్షణం సినిమాతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఈ సినిమా తర్వాత డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా అడవి శేషు రియల్ హీరో, ఉగ్రదాడిలో మరణించిన జవాన్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోసం అడవి శేషు చాలా రీసెర్చ్ కూడా చేశాడు. అంతేకాకుండా ఆర్మీ క్యాంపులో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఉన్నికృష్ణన్ స్నేహితులను, బంధువులను కలిసి ఆయన ఎలా ఉండేవాడు….అతడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేది లాంటి అంశాలను తెలుసుకున్నాడు.ఈ సినిమా టీజర్ ట్రైలర్ విడుదలైన నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించడంతో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. అలా ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్ లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..? లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.
Advertisement
సినిమా : మేజర్
నటీనటులు : అడవి శేషు, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతీ, శోభితా ధూళిపాళ్ల, మురళి శర్మ.
డైరెక్టర్ : శశికిరణ్ తిక్క
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
నిర్మాతలు : జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ మరియు సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా
Advertisement
కథ :
ఈ సినిమా పూర్తిగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం నుండి మేజర్ అయ్యేవరకు చూపించారు. అంతే కాకుండా ఎటాక్స్ లో ఏం జరిగింది ఎలా జరిగింది అనేది చూపించారు. సినిమాలో బాల్యంలో సందీప్ కిషన్ ఆర్మీ లోకి వెళ్లాలని దేశ సేవ చేయాలని ఎలా స్ఫూర్తి పొందుతాడు. మేజర్ గా ఎలా మారతాడు… చిన్న వయసులో సందీప్ ఉన్నికృష్ణన్ గురించి తల్లిదండ్రులు ఎలాంటి కలలు కంటారు. కానీ సందీప్ ఉన్నికృష్ణన్ మాత్రం అందుకు భిన్నంగా ఎందుకు ఆర్మీ లో చేరాడు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేదే ఈ సినిమా కథ.
Major Review and Rating: విశ్లేషణ :
సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఓ బయోపిక్ లా కాకుండా పూర్తిగా సినిమాటిక్ గా తెరకెక్కించారు. కానీ సందీప్ ఉన్నికృష్ణన్ కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం లో దర్శకుడు శశికిరణ్ తిక్క సక్సెస్ అయ్యాడు. చిన్న వయసులో సందీప్ మనసులో దేశ భక్తి ఎలా మొదలయ్యింది అనే విషయాన్ని దర్శకుడు గొప్పగా చూపించగలిగాడు. అదేవిధంగా సందీప్ ఉన్ని క్రిష్ణన్ ఫ్యామిలీ, అతని గర్ల్ ఫ్రెండ్ తో ఉండే అనుబంధం వారిద్దరి మధ్య సన్నివేశాలు ఎమోషన్ ను తెప్పిస్తాయి. మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేషు జీవించేశాడు. అడవి శేషు నటన సినిమాలో అద్భుతంగా ఉంది. సినిమాలో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రేవతి తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. అదేవిధంగా ఈసినిమాలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల చక్కగా నటించింది. హీరోయిన్ సాయి మంజ్రీకర్ అడవి శేష్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. సినిమా టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. మహేష్ బాబు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాను నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా సందీప్ ఉన్ని కృష్ణన్ కు నిజమైన నివాళి… ఖచ్చితంగా ఈ చిత్రాన్ని థియేటర్ లలో చూడవచ్చు.
సినిమాలోని ప్లస్ లు, మైనస్ లు :
అడవి శేషు నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ఎంతగానో టచ్ చేశాయి. సినిమా కథనం, కథ బాగున్నాయి. టెక్నికల్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సినిమాలోని మైనస్ ల విషయానికి వస్తే క్లైమాక్స్ ట్రాజిక్ ఎండింగ్ గా అనిపిస్తుంది. నరేషన్ కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది.
ALSO READ :
రామ్ చరణ్ పై మనసు పారేసుకున్న మాజీ మిస్ వరల్డ్… అతడితో డేట్ కి వెళతా అంటూ…!