Home » Mahesh Vitta Marriage : ప్రియురాలితో ఏడడుగులు వేసిన మహేష్‌విట్టా

Mahesh Vitta Marriage : ప్రియురాలితో ఏడడుగులు వేసిన మహేష్‌విట్టా

by Bunty
Published: Last Updated on
Ad

మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే నాగశౌర్య మరియు శర్వానంద్ ఇటీవల కాలంలో వివాహం చేసుకోగా.. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలు కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా… ఓ ఇంటి వాడు అయ్యాడు.

Mahesh Vitta Marriage

Advertisement

టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా తన ప్రియురాలు శ్రావణిని తాజాగా పెళ్లి చేసుకున్నారు. వైయస్సార్ పొద్దుటూరు పట్టణంలో జరిగిన ఈ వేడుకకు జబర్దస్త్ కమెడియన్లు మొత్తం హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ నటులు కూడా వచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా తన ప్రియురాలు శ్రావణిని మహేష్ ప్రేమిస్తున్నాడట. అయితే ఇటీవల కాలంలోనే ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి మరీ మహేష్ విట్టా తన ప్రియురాలిని పెళ్లాడాడు. ఇక టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Mahesh Vitta Marriage

Mahesh Vitta Marriage

 

ఇది ఇలా ఉండగా…. టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిగ్ బాస్ షో 3వ సీజన్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ విట్టా. దాదాపు బిగ్ బాస్ హౌస్ లో 60 రోజులపాటు ఉన్నాడు మహేష్. ఆ తర్వాత వరుసగా సినిమాలలో అవకాశాలు కూడా దక్కించుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, సామంతకమణి, టాక్సీవాలా, చలో, కొండ పొలం మరియు అల్లుడు అదుర్స్ లాంటి చాలా సినిమాలు చేశాడు మహేష్ విట్టా.

ఇవి కూడా చదవండి

Rajamouli : మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న.. ?

విజయ్‌ దేవరకొండ కీలక ప్రకటన.. ఫ్యాన్స్‌కు రూ.కోటి ఇస్తానంటూ ప్రకటన..

Icc world cup 2023 : వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. తిలక్, చాహాల్ ఔట్!

Visitors Are Also Reading