మహేష్‌బాబు సినిమాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, కుటంబానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారనే విషయం తెలిసిందే. సినిమా జీవితాన్ని, కుటుంబ జీవితానికి ఎప్పుడూ ముడిపెట్టి చూడరు. ఏ మాత్రం షూటింగ్ గ్యాప్ దొరికినా వెంటనే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుంటారు. ఇక మహేష్ బాబు సినిమాలకు ఎంత మంది అభిమానులు ఉన్నారో చెప్పక్కర్లేదు. హీరోలు డ్యాన్స్ చేస్తుంటే, ఫైట్స్ చేస్తుంటే చూడాలని అభిమానులు కోరుకోవడం సహజం. అయితే, కొంతమంది సెలబ్రిటీలు తమ పిల్లలు కొన్ని సన్నివేశాలను చూడకూడదని అనుకుంటారు. అలాంటి వారిలో మహేష్ బాబుకూడా ఒకరు.
మహేష్‌బాబు సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను చూసేందుకు ఆయన గారాలపట్టి సితార అస్సలు ఇష్టపడదట. సినిమాల్లోని తన యాక్షన్ సన్నివేశాలంటే తన పిల్లలకు అస్సలు నచ్చవని, సినిమాలో ఆ సన్నివేశాలు వచ్చే సమయంలో అక్కడి నుంచి లేచి వెళ్లిపోతారని మహేష్ బాబు తెలిపారు. యాక్షన్ సన్నివేశాలు తప్పించి మిగతా అన్ని సన్నివేశాలను తన పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని మహేష్ బాబు ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. మహేష్. తన ప్రతి సినిమాని మహేష్ విడుదలైన మొదటి రోజు తన ఇంట్లో కుటుంబంతో కలిసి చూస్తాడు. ఆయన దానిని అద్భుతమైన అనుభవం అని అంటున్నారు. తన పిల్లలు పెరిగేకొద్దీ వారి సున్నితత్వాన్ని తెలుసుకోవడం తండ్రిగా తనకు బహుమతినిచ్చే అనుభవం అని మహేష్ చెప్పాడు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నారు.
Advertisement