Home » అన్‌స్టాపబుల్‌ షూటింగ్‌లో సూపర్‌స్టార్‌..

అన్‌స్టాపబుల్‌ షూటింగ్‌లో సూపర్‌స్టార్‌..

by Bunty
Ad

అన్‌స్టాపబుల్‌ షోకు గెస్ట్‌లుగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ హాజరవుతున్న సంగతి తెల్సిందే.. ఈ షోను బాలయ్య హోస్ట్‌ చేస్తుండటంతో నిర్వాహకులు అనుకున్నదాని కంటే ఎక్కువ క్రేజ్‌ వచ్చింది. బాలకృష్ణ సర్జరీ ఉన్నా కూడా చేతి గాయంతోనే ఈరోజు అన్‌స్టాపబుల్‌ షో షూటింగ్‌కు హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

గత కొన్ని ఎపిసోడ్‌లలో మంచు మోహన్‌ బాబు ఫ్యామిలీ, తర్వాత నాని, బ్రహ్మనందం లాంటి వారు హాజరయ్యారు. వారిని బాలయ్య తన ప్రశ్నలతో ఒక ఆట ఆడుకున్నారు. ప్రస్తుతం మహేష్‌ బాబుపై కొన్ని సన్నివేశాలను ఈ షో నిర్వాహకులు చిత్రీకరిస్తున్నారు. మరీ సూపర్‌స్టార్‌ను బాలయ్య ఏ రేంజ్‌లో ఇంటర్వ్యూ చేశాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. ఈ షోకు బాలయ్య ప్రత్యేక డ్రెస్‌ కూడా ఓ ఆకర్షణగా మారింది. ఎపిసోడ్‌ ఎపిసోడ్‌కు బాలయ్య కొత్త కొత్తగా కనిపిస్తున్నారు. ఇంకా ఈ జాబితాలో బాలయ్యబాబుతో ఎవ్వరెవరిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారో చూడాలి మరి.. ఏదీ ఏమైనా తెలుగు ప్రేక్షకులకు ఆహా ఓటీటీతో బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోతో అనుకోని వినోదం మాత్రం లభించదని చెప్పక తప్పదు.

Advertisement

Visitors Are Also Reading