సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడు గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. మహేష్ బాబు తన నటనతో, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. మహేష్ కు అధిక సంఖ్యలో లో అమ్మాయిలు ఫ్యాన్స్ గా ఉన్నారు. అంతేకాకుండా నాలుగు పదుల వయసు దాటినా పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ ప్రేక్షకులను మైమరపిస్తున్నారు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ మహేష్ బాబు సూపర్ హిట్స్ అందుకుంటున్నారు.
Advertisement
ముఖ్యంగా గత కొంతకాలంగా మహేష్ బాబు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాలలో ఒక్కో సినిమాలో ఒక్కో మెసేజ్ ఇస్తూ ప్రేక్షకులకు మెసేజ్ తో పాటు వినోదాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Advertisement
దాంతో ఆయన ఆస్తుల విలువ ఎంత అని కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కథనం ప్రకారం… మహేష్ బాబు ఆస్తుల విలువ 32 మిలియన్ డాలర్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది. అంటే మొత్తం రూ.244 కోట్ల వరకూ ఉందని తెలుస్తోంది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో మహేష్ బాబు విలాసవంతమైన విల్లా ను నిర్వహించుకున్నారు. దాని ధర దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని సమాచారం. అదేవిధంగా బెంగళూరులో కూడా కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నట్టు సమాచారం. మహేష్ బాబు సొంత ఇళ్లల్లో స్విమ్మింగ్ పూల్,జిమ్ , మిని థియేటర్ సదుపాయాలు ఉన్నాయి. ఇక మహేష్ బాబు వద్ద లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
మహేష్ బాబు వద్ద ఉన్న లంబోర్ఘిని కారు రూ.3 కోట్ల విలువ చేస్తుంది. అదేవిధంగా రూ.90 లక్షల విలువచేసే టయోటా ల్యాండ్ క్రూయిజర్ , 49 లక్షల విలువచేసే బెంజ్ కార్ ఉన్నాయి. అదేవిధంగా రేంజ్ రోవర్ కార్, ఆడి కార్లు కూడా మహేష్ బాబు వద్ద ఉన్నాయి. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.55 నుండి రూ.65 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక యాడ్స్ కోసం మహేష్ బాబు ఏకంగా రూ.80 కోట్ల రెమ్యునరేషన్ వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.
Also read :
ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఎప్పుడు కలిగిందో, ఎందుకు కలిగిందో తెలుసా….?
నా అనుకున్న వాళ్లచేతిలోనే దారుణంగా మోసపోయి రొడ్డునపడ్డ స్టార్ హీరోయిన్ లు….!