Home » నా అనుకున్న వాళ్లచేతిలోనే దారుణంగా మోసపోయి రొడ్డునపడ్డ స్టార్ హీరోయిన్ లు….!

నా అనుకున్న వాళ్లచేతిలోనే దారుణంగా మోసపోయి రొడ్డునపడ్డ స్టార్ హీరోయిన్ లు….!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు స్టార్ట్ అవుతారో…. ఎప్పుడు ఎవరి కెరీర్ ఢమాల్ అంటుందో చెప్పలేం. ఇక్కడ శుక్రవారం వచ్చిందంటే జాతకాలు మారిపోతుంటాయి. హీరోల కంటే త్వరగా హీరోయిన్ ల జీవితాలు మారిపోతుంటాయి. సినిమా అవకాశాల కోసం హీరోయిన్లు ఎంతగానో కష్టపడాల్సి వస్తుంది. ఇక ఎంతో కష్టపడి పైకి వచ్చిన తర్వాత కొన్ని ఏళ్ళు మాత్రమే కెరీర్ కలర్ ఫుల్ గా ఉంటుంది. కాస్త వయసు పెరగ్గానే సినిమాలకు దూరం కావాల్సి వస్తుంది. అంతే కాకుండా మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వారి సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది. అలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లుగా ఎదిగిన కొంతమంది హీరోయిన్లు చివరికి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అలా కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమా హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం….

savitri

Advertisement

మహానటి సావిత్రి స్టార్ హీరోయిన్ గా రాణించింది. చివరికి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన సావిత్రి హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ ను అందుకుంది. కానీ దానధర్మాలు చేస్తూ చివరికి నమ్మిన వాళ్ళే మోసం చేయడంతో తాగుడుకు బానిసై ఆస్తులన్నీ పోగొట్టుకుంది. అంతేకాకుండా చివరిదశలో దిక్కులేని స్థితిలో మృతి చెందింది.

Advertisement

అందం అభినయం కలిగిన ఒకప్పటి హీరోయిన్ భానుమతి. సినిమాల్లో బయట కూడా సాంప్రదాయబద్దంగా కనిపించే భానుమతి ఎంతోమంది గౌరవాన్ని సంపాదించుకుంది. ఇండస్ట్రీలో అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది. తాను సంపాదించిన మొత్తాన్ని భానుమతి నా అనుకున్న వారి చేతిలో పెట్టింది. ఈ క్రమంలో వాళ్లు మోసం చేయడంతో ఆశ్రమం పోయి చివరికి రోడ్డున పడింది.

Silk Smitha

Silk Smitha

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన నటి సిల్క్ స్మిత. ఐటెం సాంగ్స్ చేస్తూ సిల్క్ స్మిత ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలే ఎదురు చూసే స్థాయికి ఎదిగింది. కానీ చివరికి నా అనుకున్న వాళ్ల చేతిలోనే మోసపోయి ఆత్మహత్య చేసుకుంది. వీళ్లతో పాటు సీనియర్ నటి శ్రీవిద్య, కాంచన, కన్నాంబ కూడా ఎంతో పేరు సంపాదించుకుని నా అనుకున్న వాళ్ల చేతిలో మోసపోయి చివరికి రోడ్డున పడ్డారు.

ALSO READ :

టాలీవుడ్ లో గొప్ప మనసున్న 6గురు స్టార్లు…వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంటో తెలుసా..!

ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఎప్పుడు కలిగిందో, ఎందుకు కలిగిందో తెలుసా….?

Visitors Are Also Reading