Home » మ‌హేష్‌కు.. ఆ హీరోయిన్ వండిన వంట‌లంటేనే ఇష్ట‌మ‌ట‌…

మ‌హేష్‌కు.. ఆ హీరోయిన్ వండిన వంట‌లంటేనే ఇష్ట‌మ‌ట‌…

by Bunty
Ad

భ‌ర‌త్ అనే నేను నుంచి మొద‌లు పెట్టి స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో హ్యాట్రిక్ హిట్ సాధించి మంచి ఊపుమీదున్న హీరో మ‌హేష్ బాబు. ప్ర‌స్తుతం స‌ర్కారువారి పాట సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ నెల‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న‌ది. సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇక‌, ఈ సినిమా త‌రువాత మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌నున్నారు. ఆ త‌రువాత రాజమౌళితో సినిమా తెర‌కెక్కాల్సి ఉంది. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రాజ‌మౌళి సినిమా తెర‌కెక్కుతుంది.

Advertisement

Advertisement

ఇక ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్‌కు మ‌హేష్ బాబు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో అనేక విష‌యాల గురించి చర్చించారు. ఈ క్ర‌మంలో మ‌హేష్‌బాబు త‌న అమ్మ‌మ్మ‌చేతి వంట అంటే చాలా ఇష్టం అని, చిన్న‌ప్ప‌టి నుంచి అమ్మ‌మ్మ వండే వంట‌లు వ‌ద‌ల‌కుండా తినేవాడిన‌ని చెప్పారు. త‌న‌కు అమ్మ‌మ్మ‌తో ఉన్న అనుబంధాన్ని మ‌హేష్‌బాబు గుర్తుచేసుకున్నారు.

ప్ర‌స్తుతం ఉప్పుకారం లేకుండా వంట‌లు తింటున్నాన‌ని, హైద‌రాబాద్ బిర్యానీ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పాడు. మహేష్ అమ్మమ్మ స్వగ్రామం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాకకు సమీపంలో ఉన్న ముసళ్ల‌మడుగు. ఇక మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా మంచి ఆహారపు ప్రియుడు అని… ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలు ఎక్కువగా తినే వారిని కూడా ఈ సందర్భంగా మహేష్‌తో ఎన్టీఆర్‌ ప్రస్తావించాడు.

Visitors Are Also Reading