మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా సినిమా ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్ లో, టీజర్ లో మాత్రం కాజల్ ఎక్కడా కనిపించలేదు. దాంతో కాజల్ అసలు సినిమాలో ఉందో లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
Advertisement
దానిపై కొరటాల శివ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ల్ క్లారిటీ ఇచ్చారు. విప్లవకారుడి పాత్రకు ప్రేమ కథ సెట్ అవ్వదు అని కాజల్ ను అందుకే సినిమా నుండి తొలగించినట్టు చెప్పారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో చరణ్ పాత్ర దాదాపు 30 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
Advertisement
ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన సిద్ద పాత్ర కోసం కొరటాల శివ మొదట మహేష్ బాబును సంప్రదించినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఈ కథ విన్న చిరంజీవి సతీమణి సురేఖ… రామ్ చరణ్ ఆ పాత్ర చేస్తే బాగుంటుందని పట్టుబట్టారట. దాంతో మహేష్ బాబు స్థానంలో రామ్ చరణ్ ను తీసుకున్నారు.
ఈ విషయం తెలిసిన తర్వాత మహేష్ బాబు కూడా సైలెంట్ గానే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. మరో వైపు మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆచార్య విడుదల తర్వాత రెండు వారాలకు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
Also read :
ఆస్ట్రేలియా అమ్మాయి..బీహార్ అబ్బాయి….ప్రేమ పెళ్ళిలో ఎన్ని ట్విస్టులో….!
రాఘవేంద్ర రావు చేసిన ఆ పనికి చిరంజీవికి అన్ని తలనొప్పులు వచ్చాయో తెలుసా ?