Home » నందమూరి వారసులతో మహేష్ బాబు హంగామా

నందమూరి వారసులతో మహేష్ బాబు హంగామా

by Bunty
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాలుగు స్టార్ ఫ్యామిలీస్ కి చెందిన వారిలో మహేష్ బాబు తో పాటు నందమూరి ఫ్యామిలీ వారసులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరికి ఉండాల్సిన ప్రత్యేక క్రేజ్ వాళ్లకు ఉంది. అయితే వాళ్లు ఒకే చోట కలిసి కన్పిస్తే మాత్రం కన్నుల పండుగగా ఉంటుంది.  ఇప్పుడు బుల్లితెరపై నందమూరి వారసులతో మహేష్ బాబు చేయబోయే హంగామా గురించి టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. నందమూరి వారసులు బాలకృష్ణతో ఒక షోలో, జూనియర్ ఎన్టీఆర్ తో మరో షోలో మహేష్ బాబు సందడి చేయనున్నాడు. గమనించాల్సిన విషయం ఏమంటే రెండు షోలలోనూ నందమూరి వారసులు హోస్ట్ లు కాగా మహేష్ బాబు మాత్రం అతిథిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలోనూ ఇదే విషయం టాక్ ఆఫ్ ది టౌన్.

Advertisement

ముందుగా మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’లో ప్రత్యేక ఎపిసోడ్ లో కనిపించబోతున్నాడు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 5న జెమినీ టీవీలో ప్రీమియర్ కానుంది. అయితే ఎన్టీఆర్ హౌస్ చేస్తున్న ఈ షో మహేష్ బాబు ఎపిసోడ్ తో పూర్తవుతుందని ప్రచారం జరుగుతోంది.

Advertisement

ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో “అన్‌స్టాపబుల్”లో మహేష్ బాబు అతిథిగా అడుగు పెట్టబోతున్నాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయిందని తెలుస్తోంది. మహేష్ బాబు, బాలయ్య కలిసి చేయబోయే ఈ ఫన్ ఎపిసోడ్ ఈ నెలాఖరులో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Visitors Are Also Reading