సూపర్‌స్టార్ కృష్ణ తనయుడు ఘట్టమనేని రమేష్ గత కొంతకాలంగా అనారోగ్యం బారిన శనివారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ముగిసాయి. అయితే తన సోదురుడిని చివరిసారిగా కూడా చూసుకునే భాగ్యం కలుగలేదు మహేష్‌బాబుకు. ఇటీవలే మహేష్‌బాబుకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో ప్రస్తుతం సెల్ప్ ఐసోలేషన్ లో ఉన్నారు.
Advertisement
Advertisement
మహేష్ సోదరుడు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. అయితే ఆయన సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసారు. మళ్లీ జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. మీరు నాకు స్పూర్తిగా నిలిచారు. నువ్వే నా బలం. నువ్వే నా ధైర్యం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకుంటే ఈరోజు ఉన్న మనిషిలో సగం ఉండే వాడిని కాదు. మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. మీరు నాకు స్ఫూర్తిగా నిలిచారు.