సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోను హీరో అనిపించుకున్నారు.
Read also : ఆ ప్రైవేట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న సంయుక్త మీనన్…అతని పేరు వేయించుకుందా !
Advertisement
ఇక ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా అయిపోయాక రాజమౌళితో చేస్తారు. ఇదంతా పక్కకు పెడితే ఇటీవల ఫ్యామిలీతో కలిసి ప్యారిస్, జర్మనీకి హాలిడే ట్రిప్ వెళ్లి వచ్చిన మహేష్ శుక్రవారం మరోసారి కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళాడు. భార్య పిల్లలను తీసుకుని దుబాయ్ కు చెక్కేశాడు.
Advertisement
Read Also : ఇదేందయ్యా ఇది… 65 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయితో మేయర్ పెళ్లి
అయితే అక్కడ మహేష్ ఒక విలాసవంతమైన విల్లా కొన్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెస్టారెంట్, మల్టీప్లెక్స్ బిజినెస్ ల ద్వారా భారీగా సంపాదిస్తున్న మహేష్ కు పలు నగరాల్లో లగ్జరీ విల్లాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా దుబాయ్ లో సైతం ఓ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విల్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసేందుకే ఆయన దుబాయ్ వెళ్లినట్లు టాక్. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
READ ALSO : వాహనాల కింద “నిమ్మకాయలను” పెట్టి ఎందుకు తొక్కిస్తారు…?