కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు, తమిళం, మలయాళంలలో పలు సినిమాల్లో నటిస్తుంది. ప్రధానంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇక ఈ ఏడాది కీర్తి సురేష్ నుండి గుడ్ లక్ సఖీ, సాని కాయితం, సర్కారు వారి పాట, మలయాళంలో వాషి అనే చిత్రాలను చేసింది. వీటిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట మినహా అన్ని కూడా నిరాశపరిచాయి. తాను చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంపై కీర్తి సురేష్ తాజాగా స్పందించింది.
Advertisement
Advertisement
తాను చేసే సినిమాలు ఫ్లాప్ అయినా, హిట్ అయినా అన్నింటినీ తాను ప్రేమిస్తానని చెప్పుకొచ్చింది. ఫ్లాప్ సినిమా, హిట్ సినిమా అని తాను వర్గీకరించలేనని తెలిపింది. ఎంతో కష్టపడి చేసిన సినిమా బాగా ఆడక పోతే కాస్త బాధ మాత్రం తప్పక ఉంటుందని అన్నారు. కానీ ఎప్పుడూ కూడా ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అనే ఫీలింగ్ రాలేదని వెల్లడించింది. ”కథలో కొత్త దనం చూసి ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఆ సినిమా అనుకున్నట్లుగా తెరపైకి రావచ్చు.. రాకపోవచ్చు. అలా వస్తే సినిమా హిట్ అవుతుంది. లేకుంటే ఫ్లాప్ అవుతుంది. కానీ నేను ఒప్పుకున్న ప్రతి సినిమాకు వంద శాతం మనసు పెట్టి కష్టపడి చేస్తాను. అలాగే ఒకటి రెండు ఫ్లాప్ లు వచ్చినంత మాత్రాన కెరీర్ ముగిసినట్టు కాదు. పరాజయం అనేది ఒక అనుభవంగానే తీసుకుంటా. అలాగే నేను చేసే ప్రతి సినిమాను సొంత బిడ్డల్లా ప్రేమిస్తాను” అంటూ ఈ మహానటి చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే నేచురల్ స్టార్ నానితో దసరా చిత్రాన్ని కూడా చేస్తుంది. దీంతో పాటు తమిళంలో మామన్నన్ అనే పొలిటికల్ థ్రిల్లర్ చేస్తుంది ఈ బ్యూటీ.
Also Read : చిరంజీవి సహా ఆ ఇద్దరు స్టార్ లు బాలయ్యను అందుకోలేకపోతున్నారా..?