పెద్ద పట్టణాలనుంచి మారుమూల పల్లెలకు చేరింది ఈ ఫుడ్. పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతిరోజు తప్పనిసరిగా దీన్ని తింటుంటారు.. పిల్లలే కాదండోయ్ పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఆస్వాదించే ఈ ఫుడ్ వినియోగదారులకు మరోసారి షాక్ ఇస్తోంది.. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకుందాం..!! మనం టీవీలో చాలా సీరియస్ గా సినిమా చూస్తూ ఉంటాం. మధ్యలో తక్కువ బ్రేక్ వస్తుంది.
Advertisement
అందులో ముఖ్యంగా ఎక్కువగా కనబడేది మ్యాగీ యాడ్. ఈ మ్యాగీ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం.. పొద్దున్నే దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా చేస్తారు.కానీ ఐదు నిమిషాల్లో తయారు చేసే ఫుడ్. ఒక్కసారి నోట్లో వేసుకుంటే మసాలా ఘాటు నషాళానికి అంటుతుంది. చిన్నపిల్లల అయితే లొట్టలేసుకుంటూ తింటారు.. నెస్లే కంపెనీకి చెందిన ఈ మ్యాగీ ధరలు త్వరలో పెరగనున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ మార్చిలో 9 నుండి 16 శాతం ధరలు పెంచింది.
Advertisement
అయితే ప్రస్తుతం ఈ ధరలను మరింత పెంచనున్నట్లు నెస్లే ఇండియా వెల్లడిస్తోంది. వీటితో పాటుగా నెస్లే సంస్థకు చెందిన నెట్ కేఫ్ కాఫీ, కిట్ కాట్ ధరలు కూడా పెరుగుతాయని నెస్లే సీఈఓ స్నిడర్ తెలియజేశారు అంటూ జాతీయ మీడియా ఈ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇంధన ధరలు పెరగడం, ముడిసరకు, ట్రాన్స్పోర్ట్, వర్కర్లకు జీతాలు వంటివి పెరగడంతో మ్యాగీ ధరలు కూడా పెరిగాయని సీఈఓ తెలియజేశారు.
ALSO READ :
పిల్లల ఫుడ్ విషయంలో పెద్దలు చేసే తప్పులు ఇవే..!
మీకు రాత్రి నిద్ర పటట్లేదా.. అయితే ఇలా చేయండి..?