Telugu News » రాజమౌళి సినిమాలో మాధవీలత కు ఛాన్స్..కానీ అందుకే వదిలేసిందట…!

రాజమౌళి సినిమాలో మాధవీలత కు ఛాన్స్..కానీ అందుకే వదిలేసిందట…!

by AJAY MADDIBOINA

నాని హీరోగా నటించిన స్నేహితుడు సినిమా తో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మాధవిలత. అప్పట్లో ఈ సినిమా పాటలు సూపర్ హిట్ కావడంతో మాధవిలత అందరికీ సుపరిచితురాలు అయిపోయింది. అయితే ఈ సినిమా తరువాత మాధవి లత ఒకటి రెండు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి చేయలేదు. కానీ తెలుగు అమ్మాయి కావడంతో మాధవిలత ముందుండి అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా మాధవిలత తరచూ సినిమాలపై, రాజకీయాలపై, సామాజిక అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది.

Ads
Madhavi latha

Madhavi latha

దాంతో సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా తను చేసే వ్యాఖ్యలతో మాత్రం హాట్ టాపిక్ గా నే నిలుస్తుంది. రీసెంట్ గా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ పై పురుష సంఘం కేసు వేయడంతో ఆ అంశంపై స్పందించింది. ఇది ఇలా ఉండగా తాజాగా మాధవిలత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమా లో తనకు ఓ పాటలో డ్యాన్స్ చేసేందుకు అవకాశం వచ్చిందని తెలిపింది. కానీ అప్పుడు తను స్నేహితుడా సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు అని చెప్పింది. అంతేకాకుండా ఓ పిఆర్ఓ కూడా తనను రాజమౌళి సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తావా అని అడిగినట్టు తెలిపింది. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాలో ‘యంగ్ యమా యంగ్ యమా” అనే పాటలో డాన్స్ చేయాలని కోరినట్టు తెలిపింది.

 

కానీ తనకు ఐటమ్ సాంగ్స్ అంటే ఆసక్తి లేకపోవడం వల్ల నో చెప్పానని చెప్పింది. అదే విధంగా ఓ నిర్మాత ఏకంగా మూడుసార్లు మూడు సినిమాలకు ఐటమ్ సాంగ్స్ చేయాలని కోరారని వ్యాఖ్యానించింది. దానికి కూడా తాను నిరాకరించినట్టు చెప్పింది. ఇక అప్పట్లో ఐటమ్ సాంగ్ చేస్తే ఒక రోజు డేట్ కి లక్ష చొప్పున మూడు రోజులు సాంగ్ షూటింగ్ ఉంటే మూడు లక్షలు ఇచ్చేవారని తెలిపింది. అంతేకాకుండా సినిమాల్లో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని తనకు నచ్చినప్పుడే సినిమాలు చేశానని …నచ్చకపోతే వదిలేశారని తెలిపింది.


You may also like