దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రణం, రౌద్రం, రుధిరం) సంక్రాంతి సందర్భంగా జనవరి 07న విడుదల చేయాల్సి ఉండగా. కరోనా, ఒమిక్రాన్ వేరియంట్‌ల కారణంగా వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్‌తో పాటు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కూడా వాయిదా వేశారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా వేయంతో ప్రేక్షకులు , అభిమానులు అందరూ చిత్రబృందంపై అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
Advertisement
అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ మేనియా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌లకు మంచి స్పందన వస్తోంది. మాస్ అంతిమ్ నాటు నాటు పాటకు వచ్చిన రెస్పాన్ అంతా ఇంకా కాదు. దీని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరే లేదు.
Advertisement
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులకు ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు. ఈ పాటలో అందరికీ చరణ్, తారక్‌ల బాండింగ్ చూడముచ్చటగా అనిపిస్తే.. ఓ స్టార్‌కు మాత్రం అసూయ పుట్టిందట. ఈ విషయాన్ని ఆ హీరోనే స్వయంఆ ప్రకటించారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను చూసి తనకు అసూయ పుట్టిందని ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ సోషల్ మీడియాలో వ్యక్తం చేసాడు. నాటు నాటు పాటలో చరణ్, తారక్ వేసిన స్టెప్పుల వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఎన్టీఆర్, రాంచరణ్ అద్బుతంగా డ్యాన్స్ చేసారు. వారిద్దరీ స్నేహం, సమన్వయం నాలో ఈర్ష్య పుట్టేవిధంగా చేస్తున్నాయి అని పేర్కొనడం గమనార్హం.