హైదరాబాద్ కూకట్ పల్లి లో ఇండియాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ని సెప్టెంబర్ 27న ఘనంగా ప్రారంభించారు. లూలూ మాల్ ఓపెన్ అవ్వడమే లేట్ ఇక హైదరాబాద్ నగర వాసులు మాల్ లోకి పెద్ద ఎత్తున వెళ్లారు. మూడు రోజులు సెలవు కావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం అక్టోబర్ 1 న ఈ మాల్ కి వేలాది నగరవాసులు వచ్చారు. మాల్ లోపల, బయట కూడా విపరీతమైన జనం. సోషల్ మీడియాలో కూడా ఈ మాల్ కి వెళ్లి జనం చేసిన పనిని మనం చూసాం.
హైదరాబాదులో దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ వచ్చిందో లేదో ఇక పెద్ద ఎత్తున జనం వచ్చారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో రీసెంట్ గా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ మాల్ ప్రారంభమయ్యింది. నెట్టింట ఈ మాల్ పై విపరీతంగా చర్చ కూడా సాగుతోంది. మూడు రోజులు సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో మాల్ కి జనం వచ్చారు. కూకట్ పల్లి లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది.
Advertisement
Advertisement
శనివారం నాడు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మాల్ కి వచ్చిన జనం వచ్చి చూసి వెళ్లడమో లేదంటే కొనుక్కుని వెళ్ళిపోకో సీసీ కెమెరా కళ్ళు కప్పి దోచేశారు. బిస్కెట్లు, సమోసాలు, ఫ్రూట్స్, కూల్డ్రింక్స్ ఇలా చేతికి దొరికినవన్నీ తినేశారు. సగం సగం తినేసి మరీ మాల్ లో వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారాయి, అంతర్జాతీయ లెవెల్లో మన పరువుని తీస్తున్నారంటూ కామెంట్లు వస్తున్నాయి.
Also read:
- పితృపక్షం రోజులలో ఈ జీవులకు.. ఆహారం పెడితే మంచిదట..!
- మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నారా..? ఈ నూనె రాయండి సరిపోతుంది…!
- బిర్యాని ఆకులతో ఈ సమస్యలన్నీ పోతాయి.. అందుకే రెగ్యులర్ గా తీసుకోండి..!