పల్లెటూర్లలో పచ్చని చెట్లతో కళకళలాడుతుంటే సిటీలో మాత్రం పెద్దపెద్ద భవనాలు దర్శనమిస్తూ ఉంటాయి. మొక్కలు పెంచడం అనేది చాలామందికి ఎంతో ఇష్టమైన పని అయినప్పటికీ తగినంత ప్లేస్ లేక సిటీలో ఉండేవారు మొక్కలను పెంచాలని ఆసక్తిని చంపేసుకుంటారు. మొక్కలు పెంచాలని ఆసక్తిగలవారికి ఇంటిలోనే పెంచే ఎన్నో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఈ మొక్కలు మనకు కేవలం ఆరోగ్యాన్ని, ఆక్సిజన్ ని అందించడమే కాదు.. అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయట. ఇప్పుడు ఇంట్లో పెంచే ఆ లక్కీ ప్లాంట్స్ ఏవో తెలుసుకుందాం.
Advertisement
#1. తులసి :
మన పూర్వికులు కాలం నుంచి తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన మొక్కలలో తులసి ఒకటి. తులసి గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉండడం చేత ఈ మొక్క వాతావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల దోమలు కూడా దరి చేరవు.
#2 ఆర్కిడ్లు :
ఇంట్లో పెరిగే ఉత్తమమైన మొక్కలలో ఇది ఒకటి. ఈ మొక్కలు విజయానికి సంకేతంగా పరిగణించబడతాయి. ఎందువలన అంటే ఆర్కిడ్లు మొక్క సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది మొత్తం కుటుంబ వృద్ధికి దోహదం చేయడమే కాకుండా, ఇంటిలోని ప్రశాంతవంతమైన వాతావరణ ఏర్పరచడంలో ఈ మొక్క సహాయపడుతుంది.
#3 వెదురు:
Advertisement
వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కను కూడా అదృష్టానికి సంకేతకంగా సూచిస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన ఆ ఇంటిలో నివసించే వారు ఎల్లప్పుడూ ఆరోగ్యం ఉంటారట. ఎందుకంటే ఇంట్లో ఈ మొక్కలు ఉండటం వల్ల గాలిని శుద్ధి చేసి కాలుష్యాన్ని తొలగిస్తుంది. వెదురు మొక్కను తూర్పు మూలలో పెట్టడం మంచిదని వాస్తు శాస్త్ర పండితులు చెబుతారు.
#4 మనీ ప్లాంట్ :
ఇక చాలామంది ఇళ్లలో ఎక్కువగా మనీ ప్లాంట్ పెంచడం మనం చూసే ఉంటాం. ఈ మొక్క కూడా సంపదని అదృష్టాన్ని సూచిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఆర్ధిక సమస్యలు తొలగిపోవడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందట. ఎందుకంటే ఇంటిలోని విషవాయువులను తొలగించడంలో మనీ ప్లాంట్ ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ మొక్కను ఇంటిలో పెట్టుకోవడం వల్ల వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ విజయాలు సాధిస్తారట.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలు తప్పవు
ఇతరులను మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలి..? హిప్నోటిజం గురించి చాణక్య ఏం అన్నారంటే..?
కాలికి నల్ల దారాన్ని… ఈ మూడు రాశుల వారు తప్పక కట్టుకోవాలి..!