Home » ఎస్ఆర్‌హెచ్ పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఘ‌న విజ‌యం

ఎస్ఆర్‌హెచ్ పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఘ‌న విజ‌యం

by Anji
Ad

టీ-20 మెగా టోర్నీల్లో ల‌క్నో మ‌రో విజ‌యం సాధించింది. హైద‌రాబాద్‌తో హోరాహోరీగా సాగిన‌ మ్యాచ్‌లో 12 ప‌రుగుల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ గెలుపొందింది. 170 ప‌రుగుల ల‌క్ష్యంతో ఛేద‌న‌కు దిగిన హైద‌రాబాద్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 157 9స్కోరుకే ప‌రిమిత‌మైంది. ల‌క్నోకు ఇది రెండ‌వ గెలుపు కాగా.. హైద‌రాబాద్‌కు ఇది వ‌రుస‌గా రెండ‌వ ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.


తొలుత కెప్టెన్ రాహుల్ (68, 50 బంతుల్లో) దీప‌క్ హుడా (51, 33 బంతుల్లో) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో సూప‌ర్ జెయింట్స్ 7 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు చేసింది. అనంత‌రం హైద‌రాబాద్ 9 వికెట్ల‌కు 157 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. అవేష్ ఖాన్ (4 -24) కృనాల్ పాండ్య (2-27) హోల్డ‌ర్ (3-34) ఆ జ‌ట్టును క‌ట్ట‌డి చేశారు. రాహుల్ త్రిపాఠి (44 30 బంతుల్లో), నికోల‌స్ పూర‌న్ (34 24 బంతుల్లో) జ‌ట్టును గెలిపించేందుకు ప్ర‌య‌త్నం చేసి విఫ‌లం చెందారు.

Advertisement

Advertisement

స‌న్‌రైజ‌ర్స్ ఛేదించేందుకు ప్ర‌య‌త్నించినా.. అవేష్‌ఖాన్ ఆరంభంలో, చివ‌ర్లో ఆ జ‌ట్టును గ‌ట్టి దెబ్బ తీసి ల‌క్నో విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ విలియ‌మ్స‌న్ ఔట్ చేసి స‌న్‌రైజ‌ర్స్ కు కోలుకోలేని దెబ్బ‌తీశాడు. చివ‌రి 3 ఓవ‌ర్ల‌లో 33 ప‌రుగులు చేయాల్సి ఉంది. త‌న చివ‌రి ఓవ‌ర్ వేసేందుకు వ‌చ్చిన అవేష్ తొలి బంతికే సిక్స్ ఇవ్వ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ గెలుస్తుంద‌నే ఆశ క‌లిగించాడు. వెంట‌నే వ‌రుస బంతుల్లో పూర‌న్, స‌మ‌ద్‌ల‌ను ఔట్ చేశాడు. అదేవిధంగా చివ‌రి ఓవ‌ర్ లో హోల్డ‌ర్ 3 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ ఓట‌మి ఖాయ‌మైంది.

Visitors Are Also Reading