ఒకప్పుడు ఏ సినిమా విడుదలైనా ప్రొడ్యూసర్ లకు పెద్దగా నష్టాలు వచ్చేవి కావు. సినిమా ఎలా ఉన్నా మినిమమ్ వసూళ్లు వచ్చేవి. కానీ కరోనా ప్రభావం ఓటిటి దెబ్బతో థియేటర్ పరిశ్రమ తీవ్రనష్టాల్లో మునిగిపోయింది. థియేటర్ లకు జనాలు రావడానికి ఆసక్తిచూపించడం లేదు. దాంతో ప్రొడ్యూసర్ తీవ్రంగా నష్టపోతున్నారు.
Advertisement
కానీ ఇలాంటి సమయంలో కూడా మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలు ప్రొడ్యూసర్ ల జేబులు నింపాయి. ఇక ఆగస్టులో విడుదలైన కొన్ని సినిమాలు మంచి విజయం సాధించి ప్రొడ్యూసర లకు లాభాలను తెచ్చిపెట్టాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….
విజయ్ దేవరకొండను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమా గీతాగోవిందం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమాకు 15కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగగా 70 కోట్ల షేర్ తో పాటూ 55 కోట్ల లాభాలను తీసుకువచ్చింది.
నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు 12.8 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగ్గా 50 కోట్ల షేర్ రాబట్టి మరిన్ని వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.
Advertisement
మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాకు 20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 51 కోట్ల షేర్ ను వసూళు చేసి 31 కోట్ల లాభాలను రాబట్టింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఫిదా సినిమా మంచి విజయం సాధించింది. 18కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమా 50 కోట్ల షేర్ ను వసూళు చేసి 30.5 కోట్ల లాభాలను రాబట్టింది.
అర్జున్ రెడ్డి సినిమాకు 5.5 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగ్గా 26కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా ఈ సినిమాకు 20 కోట్ల లాభాలు వచ్చాయి.
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాకు 15.6కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు 40 కోట్ల షేర్ రాగా 22 కోట్ల వరకూ లాభాలు వచ్చాయి.
రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా సీతారామం కు 16.2 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. కాగా ఈ సినిమా 40 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రానికి 22 కోట్ల లాభాలు వచ్చాయి.