Telugu News » Blog » 35ఏళ్ల ప్రేమ‌..65ఏళ్ల వ‌య‌సులో పెళ్లి…వీళ్ల‌ ల‌వ్ స్టోరీ వేరే లెవ‌ల‌యా..!

35ఏళ్ల ప్రేమ‌..65ఏళ్ల వ‌య‌సులో పెళ్లి…వీళ్ల‌ ల‌వ్ స్టోరీ వేరే లెవ‌ల‌యా..!

by AJAY
Published: Last Updated on
Ads

నిజ‌మైన ప్రేమ‌కు మ‌ర‌ణం లేదంటారు. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న అందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. సినిమాలో మాదిరి ట్విస్ట్ ల‌తో ఈ జంట ల‌వ్ స్టోరీ క‌నిపిస్తోంది. 35 ఏళ్ల క్రితం ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. కానీ అన్ని క‌థ‌ల్లానే అమ్మాయి పేరెంట్స్ వారి పెళ్లికి నో చెప్పారు. అంతే కాకుండా అమ్మాయికి వేరే వివాహం చేసారు. దాంతో అబ్బాయి మాత్రం ఆమె జ్ఞాప‌కాల‌నే త‌లుచుకుంటూ ఒంటరిగా ఉండిపోయాడు.కానీ 65 ఏళ్ల వ‌య‌సులో ఆ జంట ఒక‌ట్ట‌య్యారు.

Advertisement

65 years lovers married

65 years lovers married

త‌మ ప్రేమ‌కు మ‌ర‌ణం లేద‌ని చాటి చెప్పారు. అది ఎలానో ఎక్కడ జ‌రిగిందో పూర్తి వివ‌రాలు ఇప్ప‌డు తెలుసుకుందాం…..ఈ ల‌వ్ స్టోరీ క‌ర్నాట‌క రాష్ట్రం మైసూరులోని హెబ్బాళ ప్రాంతంలో జ‌రింగింది. చిక్క‌ణ్ణ అనే వ్య‌క్తి అదే ప్రాంతానికి చెందిన జ‌య‌మ్మ‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. కొంత‌కాలం ఎంతో గాడంగా ప్రేమించుకున్న వీరి పెళ్లికి జ‌య‌మ్మ త‌ల్లి దండ్రులు నిరాక‌రించారు. జ‌య‌మ్మ‌ను మ‌రో వ్య‌క్తికి ఇచ్చి వివాహం జ‌రిపించారు. దాంతో చిక్క‌న్న మ‌రో యువ‌తిని పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు.

Advertisement

ALSO READ : ప్రేమ‌పేరుతో వాలంటీర్ ను మోసం చేసిన కానిస్టేబుల్…భార్య ఉండ‌గానే.!

జ‌య‌మ్మ జ్ఞాప‌కాల‌తోనే ఇంత‌కాలం గడిపాడు. అయితే ఇటీవ‌ల జ‌య‌మ్మ భ‌ర్త అనారోగ్యంతో మ‌ర‌ణించాడు. అంతే కాకుండా జ‌య‌మ్మ‌కు కూడా సంతానం లేదు. దాంతో ఆమె కూడా ఒంటరి జీవితం గ‌డుపుతోంది. ఈ క్ర‌మంలో ఆమె కూడా మ‌ళ్లీ చిక్క‌న్న జ్ఞాప‌కాలను నెమ‌రువేసుకుంది. అలా ఇద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ ప్రేమ చిగురించింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌మ బంధువుల‌కు చెప్ప‌డంతో వారే దగ్గ‌రుండి మ‌రీ వివాహం జ‌రిపించారు. అలా 35 ఏళ్ల క్రితం ప్రేమించుకున్న ఈ జంట‌ ఇప్పుడు పెళ్ళి చేసుకుని ఒక్క‌టైంది.