మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ మహాసంగ్రామం ప్రారంభం కాబోతోంది. పది జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో సత్తా చాటి కప్ గెలవాలన్న కసి ప్రతి జట్టులో కనిపిస్తోంది. టైటిల్ ఫేవరెట్ జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ టోర్నిలో వికెట్ కీపర్ పై బౌలర్ల చూపుపడింది. విరాట్ కోహ్లీనీ పడగొడితే మ్యాచ్ స్వరూపం మార్చవచ్చు అన్న ధీమాతో ఉన్నారు బౌలర్లు. విరాట్ కోహ్లీని నేను అవుట్ చేస్తా అంటే నేను చేస్తానంటూ పోటీ పడుతున్నారు. విరాట్ కోహ్లీని 5 బంతుల్లో అవుట్ చేస్తానని అంటున్నాడు నెదర్లాండ్స్ స్టార్ బౌలర్.
పసికూనగా భావించే నెదర్లాండ్స్ ప్రపంచకప్ కు అర్హత సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో వారిలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈ క్రమంలో ఆ జట్టు స్టార్ బౌలర్ లోగాన్ కోహ్లీ వికేట్ పై కన్నేసినట్టు చెప్పుకొచ్చాడు. కోహ్లీని అవుట్ చేయడానికి నాకు ఐదు బాల్స్ చాలు అంటూ కామెంట్ చేశారు. కోహ్లీనీ కేవలం 5 బంతుల్లో ఎలా అవుట్ చేయాలో ప్లాన్ వేసుకున్నానని, అయితే ఆ ప్లాన్ ఏంటో కూడా చెప్పాడు. తొలి రెండు బాల్స్ అవుట్ స్వింగ్ వేస్తా, ఆ తర్వాత బాల్స్ స్లో కట్టర్ వేస్తా, అయితే ఈ బాల్ ను కోహ్లీ ఫోర్ కొడతాడు. అప్పుడు నేను చికాకు పడ్డట్టు నటించి మా కెప్టెన్ తో ఏదో మాట్లాడినట్టు నటించి నా హ్యాండ్ ను ఫీల్డింగ్ వైపు చూపిస్తాను.
Advertisement
Advertisement
కానీ నేను అటువైపు బాల్ వేయను. వేరే వైపు వేస్తే కోహ్లీ ఫోర్ కొడతాడు. ఆ తర్వాత బంతికి క్రికెట్ దేవుళ్లను మొక్కి కోహ్లీని అవుట్ చేస్తానంటూ విచిత్రమైన ప్రణాళికను రివిల్ చేశాడు. అయినా తాను బౌలింగ్ వేస్తాను అన్నది కోహ్లీకి అనుకుంటున్నాడో లేక మరి ఎవరికైనా అనుకుంటున్నాడేమో కానీ లోగాన్ ను సోషల్ మీడియాలో నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ మనసుపెట్టి బ్యాటింగ్ చేస్తే మళ్లీ టీం ఇండియాతో ఆడాలన్న ఆశ చచ్చిపోతుంది జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా… మెగా టోర్నీలో ఆడేందుకు నెదర్లాండ్స్ భారత్ గడ్డపై అడుగు పెట్టింది. ప్రపంచకప్ ముందు జరగబోయే వర్మప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా-భారత్ తలపడ్డాయి. మెగా టోర్నీ తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్ తో జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
- తన మొదటి భార్యకు అక్కినేని నాగార్జున ఎందుకు విడాకులు ఇచ్చాడు ?
- రానా కారణంగా త్రిష, ప్రభాస్ పెళ్లి క్యాన్సిల్ అయిందా ?
- హైదరాబాద్ లో బీఫ్ పెట్టడం లేదని పాక్ క్రికెటర్ల రచ్చ ?