కరోనా కేసులు ఇండియాలో మళ్లీ పేరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కరోనాపై కేంద్రం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలను ఇప్పటికే సంసిద్ధం కావాలని కోరింది. ఇవాళ కోవిడ్ డ్రై రన్ నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ రాత్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉండగా, ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియాలో లాక్ డౌన్ విధిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
Advertisement
కరోనా ఫోర్త్ వేవ్ భయం మధ్య దేశంలో 7 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇంటర్నెట్ లో విస్తృతంగా వైరల్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ CE న్యూస్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రకారం, డిసెంబర్ 24 నుంచి భారతదేశంలో లాక్ డౌన్ అమలవుతుందని ఉంది. ఒక వారం పాటు లాక్ డౌన్ ఉంటుందన్న సందేశం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Advertisement
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించినట్లు దానిలో పేర్కొంది. అయితే, పోస్ట్ వైరల్ కావడంతో ప్రభుత్వానికి సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అసలు వాస్తవాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నకిలీదని వెల్లడించింది. ఈ మేరకు పిఐబి ఒక ట్వీట్ చేసింది. ఈ వీడియోలోని సమాచారం నకిలీది, భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ పేర్కొంది. కాగా, గడచిన 24 గంటల్లో దేశంలో 196 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 3,428 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,46,77,302 కేసులు 5,30,695 మరణాలు నమోదయ్యాయి.
‘CE News’ नामक एक #YouTube चैनल के वीडियो में यह दावा किया जा रहा है कि आज रात 12 बजे से 7 दिन तक भारत बंद रखने का फैसला लिया गया है#PIBFactCheck
▶️ इस वीडियो में किया गया दावा फ़र्ज़ी है
▶️ भारत सरकार ने ऐसा कोई फैसला नहीं लिया है pic.twitter.com/eX3QXdkOxn
— PIB Fact Check (@PIBFactCheck) December 24, 2022
READ ALSO : తప్పు చేశానమ్మా.. నన్ను క్షమించండి.. మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడిన వ్యక్తి