Home » లోబోకు మెగా ఆఫ‌ర్‌…

లోబోకు మెగా ఆఫ‌ర్‌…

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఫొటో దిగాల‌ని చాలా మందికి ఉంటుంది. అయ‌న‌తో క‌లిసి న‌టించాల‌ని న‌టీన‌టుల‌కు ఉంటుంది. మెగాస్టార్ సినిమాలో ఒక చిన్న పాత్ర వ‌చ్చినా చాలు అనుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే, అంద‌రికీ అలాంటి అవ‌కాశాలు వ‌స్తాయా అనుకుంటే పొర‌పాటే. అలాంటిది త‌న సినిమాలో అవ‌కాశం ఉంద‌ని, వ‌చ్చి న‌టించ‌మ‌ని స్వ‌యంగా చిరంజీవి పిలిపించి మ‌రీ చెప్తే ఎవ‌రైనా కాదంటారా… ఎగిరి గంతేస్తారు. అలాంటి అవ‌కాశం ఇప్పుడు లోబోకు వ‌చ్చింది.

త‌న ప్ర‌త్యేక‌మైన ఫ్యాష‌న్‌తో బుల్లితెర బిగ్‌బాస్‌లో ఆక‌ట్టుకున్న లోబో బుల్లితెర‌పై అప్పుడ‌ప్పుడు సంద‌డి చేస్తున్నాడు. వెండితెర‌పై కూడా చిన్న చిన్న పాత్ర‌లు చేస్తున్నాడు. మెగాస్టార్ చిత్రంలో క్యారెక్ట‌ర్ ఉంది న‌టించ‌మ‌ని చెప్ప‌డం చాలా ఆనందాన్ని ఇస్తే, ఆ పాత్ర కీల‌క‌మైన పాత్ర కావ‌డం, చిరుని అంటిపెట్టుకొని ఉండే పాత్ర అయితే ఇక చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంటుంది చెప్పండి. అదృష్టం ఇంటి త‌లుపు త‌ట్టిన‌ట్టే క‌దా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న భోళా శంక‌ర్ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు ఇటీవ‌లే ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో వెల్ల‌డించారు.

Advertisement

Visitors Are Also Reading