తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఈ మధ్యకాలంలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యాయి. అలా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయిన సినిమాలలో పోయిన సంవత్సరం విడుదల అయిన లైగర్ సినిమా ఒకటి.
Read also : ఒంటరిగా గెలువలేను.. కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటా !
Advertisement
విజయ్ దేవరకొండ… పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల అయింది.అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయితే తాజాగా లైగర్ తో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన చేపట్టారు.
Advertisement
READ ALSO : చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?
హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆందోళన చేపట్టారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి లైగర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే… తమకు భారీగా నష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లైగర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమను ఆదుకుంటామని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు తమకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. అందువల్లే తాము రోడ్లపై వచ్చి ధర్నా చేస్తున్నట్టు చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకూ ధర్నా కొనసాగిస్తామని అంటున్నారు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు. గతంలో డిస్ట్రిబ్యూటర్ల వ్యవహారంపై పూరి ఓ ఆడియో టేప్ విడుదల చేసి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
READ ALSO : చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?